delta variant ఇండోనేషియాలో డెల్టా కల్లోలం... ఆక్సిజన్ కొరతతో బాధితులు విలవిల!

ABN , First Publish Date - 2021-07-11T13:51:13+05:30 IST

ఇండోనేషియాలో కరోనాకు చెందిన డెల్టా...

delta variant ఇండోనేషియాలో డెల్టా కల్లోలం... ఆక్సిజన్ కొరతతో బాధితులు విలవిల!

జకర్తా: Indonesia faces oxygen crisis ఇండోనేషియాలో కరోనాకు చెందిన డెల్టా వేరియంట్ కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. దీనికితోడు దేశంలో ఆక్సిజన్ కొరత తలెత్తింది. భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ గడగడలాడించినప్పుడు ఇండోనేషియా వేల కొద్దీ ఆక్సిజన్ ట్యాంకులను ఇక్కడకు తరలించింది. అయితే ఇప్పుడు ఇండోనేషియా ఆక్సిజన్ కోసం ఇతర దేశాలను సాయం అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఇప్పుడు ఇండోనేషయా తమ దేశానికి ఆక్సిజన్ అవసరమని భారత్, సింగపూర్, చైనాలను అభ్యర్థిస్తోంది. ఈ నేపధ్యంలో సింగపూర్ వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఇండోనేషియాకు తరలించింది. ఇదేవిధంగా ఆస్ట్రేలియా కూడా ఇండోనేషియాకు సాయం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో నాల్గవస్థానంలో ఉన్న ఇండోనేషియాలో తాజాగా ఒక రోజులో మొత్తం 39 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఇండోనేషియాకు ఆందోళనకరంగా మారింది. 

Updated Date - 2021-07-11T13:51:13+05:30 IST