డెల్టా వేరియంట్ నాలుగు రెట్లు ప్రమాదకారి!.. అమెరికా ప్రకటన

ABN , First Publish Date - 2021-06-16T23:38:58+05:30 IST

భారత్‌లో తొలిసారి బయటపడిన కరోనా ‘డెల్టా’ వేరియంట్ అత్యంత ప్రమాదకారిలా కనిపిస్తోంది. ఈ వేరియంట్‌నో ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

డెల్టా వేరియంట్ నాలుగు రెట్లు ప్రమాదకారి!.. అమెరికా ప్రకటన

వాషింగ్టన్: భారత్‌లో తొలిసారి బయటపడిన కరోనా ‘డెల్టా’ వేరియంట్ అత్యంత ప్రమాదకారిలా కనిపిస్తోంది. ఈ వేరియంట్‌నో ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పుడు అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కూడా ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించాయి. ఇంతకాలం దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌గానే అమెరికా పరిగణించింది. తాజాగా ల్యాబుల్లో చేసిన ప్రయోగాల్లో ఈ వేరియంట్‌లో న్యూట్రలైజేషన్‌ తగ్గించడం, వేగంగా వ్యాపించడం వంటి లక్షణాలు కనిపించాయట. అలాగే యూకేలో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్‌ కన్నా ఇది కనీసం 50శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సీడీసీలు తెలిపాయి. అలాగే 2.5రెట్లు అధిక ప్రమాదకారి అని కూడా వెల్లడించాయి. మొత్తమ్మీద డెల్టా వేరియంట్ సోకిన వారు ఆస్పత్రి పాలయ్యే అవకాశాల సాధారణం కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు ప్రకటించాయి.

Updated Date - 2021-06-16T23:38:58+05:30 IST