Corona Delta Variant జోక్ కాదు: జో బైడెన్

ABN , First Publish Date - 2021-07-25T22:39:25+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కారణంగా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు వ్యా

Corona Delta Variant జోక్ కాదు: జో బైడెన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కారణంగా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వ్యాక్సిన్ వేసుకోవాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. డెల్టా వేరియంట్‌ అనేది జోక్ కాదని, దాన్ని ఈజీగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ‘ప్రజలారా.. డెల్టా వేరియంట్ అనేది జోక్ కాదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతోపాటు మీకు ఇష్టమైన వారికి కూడా రక్షణ కల్పించండి. కొవిడ్ టీకా వేసుకోండి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా.. డెల్టా వేరియంట్ ధాటికి అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య గడిచిన రెండు వారాల్లో 166శాతం పెరిగింది. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో 36వేల మందికిపైగా కరోనా బారినపడగా 151 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 3.52లక్షలకు చేరువైంది. ఇదే సమయంలో 6.26లక్షల మరణాలు నమోదయ్యాయి. 


Updated Date - 2021-07-25T22:39:25+05:30 IST