డిమాండ్‌ పంటలనే సాగుచేయాలి

ABN , First Publish Date - 2020-06-04T10:19:01+05:30 IST

డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల

డిమాండ్‌ పంటలనే సాగుచేయాలి

రైతులకు లాభం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం  

ప్రతి రైతుకూ రైతుబంధు అందేలా చూడాలి 

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి 


హాలియా/ కొండమల్లేపల్లి/ దేవరకొండ, జూన్‌ 3: డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. బుధవారం హాలియాలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గ నియంత్రిత వ్యవసాయ అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి వస్తువునూ ఉత్పత్తి చేసిన వ్యక్తే ధర నిర్ణయిస్తున్నాడని, కానీ పంటలు పండించిన రైతులు ధర నిర్ణయించలేకపోతున్నారన్నారు. దీనికి కారణం డిమాండ్‌, సప్లయ్‌కు అనుగుణంగా పంటలు పండించకపోవడమేనన్నారు. రైతులు సంఘటితం  కావాలని, మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి రావాలనేదే సీఎం కేసీఆర్‌ ఆలోచన నియంత్రిత సాగు విధానమన్నారు. నీరు, పెట్టుబడి, మార్కెట్‌ అనే మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులను నిలబెట్టడమే ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ప్రతి రైతుకూ రైతుబంధు వచ్చేలా వారిని చైతన్యపరచాలన్నారు. వానాకాలంలో మొక్కజొన్న వేయొద్దని, అధిక దిగుబడి వచ్చే కంది వేయాలని, ప్రపంచ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పత్తి, సన్నరకం వరి ధాన్యాన్ని సాగు చేయాలన్నారు. ఎకరానికి పారించే నీటి ద్వారా నాలుగు ఎకరాలు మెట్టపంట పండించి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు.


కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడి, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, యడవెల్లి విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సంజీవని ట్రస్టు పేద కుటుంబాలను ఆదుకుంటుందని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.  మండలపరిధిలోని 150 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను సంజీవని ట్రస్టు నిర్వాహకుడు రఫెల్‌ ఫాదర్‌ సహకారంతో మంత్రి జగదీ్‌షరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, కొండమల్లేపల్లి, పీఏపల్లి ఎంపీపీలు దూదిపాల రేఖ, వంగాల ప్రతా్‌పరెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ చైర్మన్‌ కేసాని లింగారెడి పాల్గొన్నారు.


రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. దేవరకొండ సాయిరమ్య పంక్షన్‌హల్‌లో జరిగిన వానకాల నియంత్రిత పంటసాగు కార్యచరణ ప్రణాళిక దేవరకొండ నియోజకవర్గస్థాయి సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లోరైడ్‌ సమస్య నివారణతోపాటు నల్లగొండ జిల్లాకు 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంటే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్‌, ఏడీఏ విజేందర్‌రెడ్డి, పల్లా ప్రవీన్‌రెడ్డి, దేవేందర్‌రావు, నల్లగాసు జాన్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T10:19:01+05:30 IST