వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-18T05:07:37+05:30 IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నేతలు

 మహబూబాబాద్‌ రూరల్‌, జనవరి 17 : కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రధాని నరేం ద్ర మోదీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహారించుకోవా లని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని వివేకా నంద సెంటర్‌లో ఆదివారం ప్రధాని   దిష్టిబొ మ్మను దహనం చేశారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తానని చెబుతున్న ప్రధాని వారి వెన్ను విరుస్తున్నారని మహేష్‌ ఆరోపించారు. దుడ్డెల రాంమ్మూర్తి, యాకయ్య, రాంమ్మూర్తి, అనిల్‌, మచ్చ వెంకన్న, అశోక్‌, రాజు, నర్సింహా, భాస్కర్‌, వినయ్‌, మహేష్‌, గణేష్‌, శైలజ, శిరీష, యాదగిరి ఉన్నారు. 

 బయ్యారం : ప్రజా, రైతు వ్యతిరేక చట్టాల ను తక్షణమే రద్దు చేయాలని ప్రగతిశీల మహి ళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర నాయకులు ఊకె పద్మ డిమాండ్‌ చేశారు. బయ్యారంలో ఆదివారం నిర్వహించిన పీవోడబ్ల్యూ సదుస్సులో ఆమె మాట్లాడారు. 53 రోజులుగా ఎముకలు కొరికే చలిలో రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరో పించారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరిగే పోరాటంలో మహిళలు ముందు ఉండాలన్నారు. కృష్ణవేణి, శారద, లక్ష్మీ, కోటమ్మ, రమణ, అరుణ పాల్గొన్నారు. 

చర్చల పేరిట కాలయాపన తగదు


మహబూబాబాద్‌ రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేయ డం సరికాదని  అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) జిల్లా అధ్యక్షుడు జగ్గన్న డిమాం డ్‌ చేశారు. మహబూబాబాద్‌ పట్టణ శివారు ఈదులపూసపల్లిలో ఆదివారం వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేసేందుకే కేంద్రప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువచ్చిందన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ కె.తాజ్‌పాషా, భాస్కర్‌రెడ్డి, శంకరయ్య, ప్రభాకర్‌, రమేష్‌, ఉప్పలయ్య, భద్రయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-18T05:07:37+05:30 IST