విద్యావలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2021-04-18T06:01:10+05:30 IST

విద్యావలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

విద్యావలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్‌

ఎల్కతుర్తి, ఏప్రిల్‌ 17 : కరోనా నేపథ్యంలో విద్యావలంటీర్లను విధుల నుంచి తొలగించడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయని, ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావలంటీర్ల పరిస్థితి దయానీయంగా మారిందని, ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో 12వేలమంది వలంటీర్లు తొలగించగా ప్రస్తుతం వారు వ్యవసాయ, ఉపాధి కూలీలు గా, భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్‌మన్‌లుగా మారి జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదివిన చదువుకు చేస్తున్న పనికి పొంతన లేకుండా పోయిందని వాపోయారు. ప్రైవేటు టీచర్లతో సమానంగా విద్యావలంటీర్లకు ప్రభుత్వ సాయం అందజేయాలన్నా రు. ఆరెపల్లి చంద్రమౌళి, కామెర లక్ష్మన్‌, ఎర్ర ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:01:10+05:30 IST