ఆ ఏనుగును మాకు అప్పగించండి!

ABN , First Publish Date - 2021-03-01T14:22:08+05:30 IST

శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి ఆలయ ఏనుగు జయమాల్యదను తమకు అప్పగించాలని అసోం అటవీశాఖ అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల మేట్టుపాళయం ఏనుగుల సంరక్షణ శిబిరంలో...

ఆ ఏనుగును మాకు అప్పగించండి!

అసోం అటవీశాఖ అధికారుల డిమాండ్‌

చెన్నై(ఆంధ్రజ్యోతి): శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి ఆలయ ఏనుగు జయమాల్యదను తమకు అప్పగించాలని అసోం అటవీశాఖ అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల మేట్టుపాళయం ఏనుగుల సంరక్షణ శిబిరంలో శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఏనుగు జయమాల్యదను ఇద్దరు మావటీలు కట్టెలతో కొడుతున్న వీడియో దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో వెలువడి సంచలనం కలిగించాయి. దీనితో అటవీశాఖ అధికారులు విచారణ జరిపి ఆ ఏనుగుపై దాడి జరిపిన ఇద్దరు మావటీలను అరెస్టు చేశారు. ఈ అలజడి సద్దుమణగక ముందే ఆ ఆలయ ఏనుగును తమ రాష్ట్రం నుంచి కాంట్రాక్టు పద్ధతిన 2008లో శ్రీవిల్లిపుత్తూరు ఆలయానికి తీసుకువెళ్ళారని, ఆ ఒప్పందం గడువు ముగిసినా తిరిగి అప్పగించలేదని అసోం రాష్ట్ర అటవీ శాఖ అధికారి ఎంకే యాదవా తమిళనాడు హిందూ దేవాదాయ శాఖ అధికారులకు లేఖ రాశారు.

Updated Date - 2021-03-01T14:22:08+05:30 IST