Abn logo
Sep 26 2021 @ 00:38AM

ఎన్టీపీసీ ఏరియాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

అన్నపూర్ణకాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

జ్యోతినగర్‌, సెప్టెంబరు 25 : రామ గుండం కార్పొరేషన్‌ ఎన్టీపీసీ పరిధిలో అక్రమ నిర్మాణాలను జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది కూల్చివేశారు. నిర్మాణ సమయంలో నిబంధనలు పాటిస్తామని ఇచ్చిన అఫిడవిట్‌కు వ్యతిరేఖంగా కట్టిన ని ర్మాణాలను జేసీబీలతో తొలగించారు. కార్పొరేషన్‌ పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కట్టడాలకు సంబంధించి ఇటీవల కలెక్టర్‌ నేతృ త్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృంధం ఇటీవల అన్ని డివిజన్లలో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల సందర్భంగా గుర్తించిన అక్రమ నిర్మాణాలను స్పచ్ఛందంగా తొలగించాలని టాస్క్‌ఫోర్సు స్ప ష్టం చేసింది. అయితే ఆయా ఆదేశాలను పాటించక పోవడంతో శనివారం టాస్క్‌ఫోర్స్‌ బృందం అన్నపూ ర్ణ కాలనీ, భరత్‌నగర్‌, కాజిపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను జేసీబీలతో తొలగిం చారు. అనుమతుల సందర్భంగా సెట్‌బ్యాక్‌ ఇవ్వకపో వడం, ప్రభుత్వ స్థలంలో ఉన్న నాలుగు నిర్మాణా లను తొలగించారు. 

అడ్డుకున్న అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు

ఎన్టీపీసీ ఏరియాలోని ఒక కాలనీలో అక్రమ నిర్మా ణాల తొలగింపును అధికార టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతిని ధులు అడ్డుకున్నారు. స్థానిక భరత్‌నగర్‌లో హైటెన్షన్‌ టవర్ల కింద ఒక టీఆర్‌ఎస్‌ నాయకురాలు నిర్మిస్తున్న ఇంటిని తొలగించేందుకు వచ్చిన టాస్క్‌ఫోర్సు సిబ్బం దిని రామగుండం కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ నడి పెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు ఎన్వీ.రమణారెడ్డి, కు మ్మరి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డిప్యూ టీ మేయర్‌ అభిషేక్‌రావు మాట్లాడతూ తాము అక్ర మ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోలేదని, మున్సి పల్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అయితే భరత్‌నగర్‌లోని ఇంటి నిర్మాణానికి సంబంధించి నాలుగు రోజుల సమయం అడిగామని తెలిపారు.