బోధన్‌లో ఆర్టీసీ డిపో ప్రహరీ కూల్చివేత

ABN , First Publish Date - 2020-07-02T11:22:13+05:30 IST

బోధన్‌లో ఆర్టీసీ డిపో ప్రహరీ కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రహరీని మున్సిపల్‌ సిబ్బంది జేసీబీలతో

బోధన్‌లో ఆర్టీసీ డిపో ప్రహరీ కూల్చివేత

 రోడ్డు వెడల్పు కోసం కూల్చిన మున్సిపల్‌ అధికారులు

పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ అధికారులు


బోధన్‌, జూలై 1 : బోధన్‌లో ఆర్టీసీ డిపో ప్రహరీ కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రహరీని మున్సిపల్‌ సిబ్బంది జేసీబీలతో కూ ల్చివేయించారు. దీంతో ఆర్టీసీ అధికారులు పోలీ సులను ఆశ్రయించారు. ప్రహరీపై రెండేళ్లుగా ఆర్టీసీ, మున్సిపల్‌ అధికారుల మధ్య వివాదం కొనసాగుతోం ది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని సరస్వతీనగర్‌ రోడ్డు విస్తరణకు రెండేళ్ల క్రితమే నిధులు మంజూరయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌ క్రాసింగ్‌ నుంచి పోచమ్మ మందిరం వరకు రోడ్డు విస్తరణ కోసం ఇప్పటికే సర్వే పూర్తి అ యి మార్కింగ్‌ సైతం వేశారు. రోడ్డు విస్తరణకు ఆర్టీసీ బస్‌ డిపో ప్రహరీ అడ్డంకిగా మారడంతో విస్తరణ పనులు నిలిచి పోయాయి. ప్రహరీని కూల్చివేసేందుకు ఆర్టీసీ అధికారులు ఒప్పుకోలేదు. డిపో స్థలాన్ని రోడ్డు విస్తరణకు కేటాయిస్తే స్థలానికి పరిహారం ఇవ్వడంతో పాటు తిరిగి ప్రహరీని మున్సిపల్‌ అధికారులు నిర్మిం చి ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు తేల్చిచెప్పారు.


ఈ వ్య వహారం కారణంగా రోడ్డు విస్తరణ పనులు నిలిచిపో యాయి.బుధవారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో మున్సిపల్‌ అధికారులు సిబ్బందితో కలిసి వెళ్లి ఆర్టీసీ ప్రహరీ జేసీబీలతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఘటన స్థ లానికి చేరుకొని ప్రహరీ కూల్చివేత పనులను అడ్డుకు న్నారు. ఆర్టీసీ అధికారులు సిబ్బందికి మున్సిపల్‌ అధి కారులకు సిబ్బందికి వాగ్వాదం జరిగింది. సమాచారం ఇవ్వకుండా గోడను ఎలా కూల్చారని ఆర్టీసీ అధికారు లు ప్రశ్నించారు. సగానికి పైగా గోడ కూల్చివేయగా మిగిలిన గోడను కూల్చివేయకుండా అడ్డుకున్నారు. 


మున్సిపల్‌ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు

బోధన్‌ ఆర్టీసీ డిపో ప్రహరీని మతకు ఎలాంటి స మాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చడం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనే జర్‌ రమణ తెలిపారు. కూల్చిన చోట తిరిగి ప్రహ రీ నిర్మించి ఇవ్వాలని, కోల్పోయిన భూమికి నష్టపరి హారం చెల్లించాలని గతంలోనే సూచించామన్నారు. కా నీ తమకు సమాచారం లేకుండా గోడను కూల్చారని తెలిపారు. ప్రహరీ కూల్చివేతపై ఆర్టీసీ ఆర్‌ఎం, ఇతర ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. 


సరస్వతీ నగర్‌ ఆక్రమణల కూల్చివేత

బోధన్‌ పట్టణంలో రద్దీగా ఉండే సరస్వతీ నగర్‌ రో డ్డు ఆక్రమణల కూల్చివేత పనులు బుధవారం మొద లయ్యాయి. బస్టాండ్‌ మలుపు నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు కూల్చివేతలు చేపట్టారు. రోడ్ల పైనే ని ర్మాణాలు చేపట్టిన ఆసుపత్రులు, ఇతర భవంతుల వంతెనలు, మెట్లను మున్సిపల్‌ అధికారులు కూల్చి వేశారు. రోడ్డు విస్తరణ పనులకు స్థానికులు సహకరిం చాలని కోరారు.

Updated Date - 2020-07-02T11:22:13+05:30 IST