Abn logo
Sep 27 2021 @ 00:26AM

డెంగ్యూ పంజా..!

నిర్మల్‌లో ఓ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్న రోగులు

కుటుంబాలను గుల్ల చేస్తున్న జ్వరాలు 

అడ్డగోలుగా దోచుకుంటున్న పలు ఆస్పత్రులు

పొంతన లేని సర్కారు లెక్కలు 

నిర్మల్‌లో ఓ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్న రోగులు

నిర్మల్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డెంగ్యూ జ్వరాలు వందలాది కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకూ వీటి తీవ్రత వేగంగా విస్తరిస్తుండడంతో జనాలంతా ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. జనాల అవసరం, అమాయకత్వాన్ని ఆస రాగా చేసుకుంటున్న పలు దవాఖానాలు పరీక్షలు, చికిత్సల పేరిట అ డ్డగోలుగా దోచుకుంటున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

రెండు నెలల నుంచి పెరిగిన కేసులు..

రెండు నెలల నుంచి జిల్లా అంతటా ఈ కేసులు పెరిగిపోతుండగా పలువురు మరణించిన సంఘటనలున్నాయి. అయితే జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్లేదుటే కేసులు పెరిగిపోతున్నప్పటికీ దానిని లె క్కలోకి తీసుకోకుండా తక్కువ సంఖ్యలో చూపడం, మరణాల సంఖ్య లేనట్లుగానే పేర్కొంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇ టీవల నర్సాపూర్‌ (జి) మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన చం దాల రజిత అనే వివాహిత డెంగ్యూ లక్షణాలతో మృతి చెందింది. ఇక్క డి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ వైద్యానికి అయ్యే డబ్బులు చెల్లించలేక ఇంటికి వెళ్లింది. పేద కుటుంబానికి చెందిన ఆ మె ఇంటి వద్ద మరణించిన ఉదాంతం కలిచివేస్తోంది. గతంలోనే ఆమె భర్త కూడా మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాఽథలు గా మారారు. ప్రైవేటు ఆసు పత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వేస్తున్న కారణంగా పేద ప్రజలు అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. 

ప్లేట్‌లెట్స్‌తో బెంబేల్‌

డెంగ్యూ పీడితులకు ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయని వాటి ని వెంటనే సమకూర్చాలంటూ పలువురు డాక్టర్‌లు హల్‌చ ల్‌ సృష్టిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. రోగికి రూ.50వేల పై చిలుకు ప్లేట్‌లెట్స్‌ ఉన్నప్పటికీ కొంతమంది డాక్టర్‌లు మాత్రం ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు చేసి వెంటనే ప్లేట్‌లెట్స్‌ తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో పేద రోగులు తమ వద్ద డబ్బులు లేకున్నా అప్పులు చేసి ఒక్కో ప్లేట్‌లెట్‌ బ్యాగుకు రూ.12వేలను చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనికి ముందు ర క్తదాతల కోసం గాలిస్తూ రోగుల కుటుంబ సభ్యులు ఆలిసిపోతున్నా రు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్లేట్‌లెట్‌ యంత్రం సౌకర్యం ఉన్నప్పటికీ అది ఆర్‌బీడీ కావడంతో దానిని పక్కన పెట్టి సింగిల్‌ బ్లడ్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ కావాలంటూ పలువురు డాక్టర్‌లు తిరకాసు సృష్టిస్తున్నారు. దీం తో రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుండగా రోగులు కూ డా శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నారని చెబుతున్నారు. 

రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు

జిల్లాకేంద్రంతో పాటు భైంసాలోని ఏ ఒక్క ప్రైవేటు ఆసు పత్రిని చూసినా జ్వర పీడితులతోనే కిటకిటలాడుతున్నా యి. ఇక్కడి ప్రభుత్వాసుపత్రులు ప్లేట్‌లెట్స్‌ పేరిట జ్వర బాధితుల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. డెంగ్యూ లక్షణాలున్న వారిలోనే కా కుండా సాధారణ జ్వరాలున్న వారిలో కూడా ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతుండడం సహజమే అయినప్పటికీ కొంతమంది ప్రైవేటు డాక్టర్‌లు మాత్రం దీనిని సాకుగా చూపి రోగులను ఆందోళనకు లోను చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీని పేరిట రోగుల నుంచి కొంతమంది ప్రైవేటు డాక్టర్‌లు వేల రూపాయలను బిల్లుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నార న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే కరోనా మహమ్మారి బారి నుం చి బయట పడి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న కుటుంబాలను డెంగ్యూ జ్వరాలు మళ్లీ వెంటాడుతున్నాయి. వేల రూపాయల్లో బిల్లులు చెల్లించుకునేందుకు చాలా మంది తమ వద్ద ఉన్న ఆస్థులను అమ్ముకుంటుండగా మరికొంతమంది అ ప్పులు చేసి బిల్లులు చెల్లించుకుంటున్నారు. ఒక్కో రోగికి కొన్ని ఆసుపత్రుల్లో నాలుగైదు సార్లు ప్లేట్‌లెట్స్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి జిల్లా ఆ సుపత్రిలో ఆర్‌బీడీ ప్లేట్‌లెట్స్‌ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉం డడం రోగులకు శాపంగా మారుతోంది. పలువురు ప్రైవేటు వైద్యులు అ ప్పటికప్పుడే ఆర్‌బీడీ ప్లేట్‌లెట్స్‌ల అవసరం ఉందని వెంటనే వాటిని తీ సుకురావాలంటూ రోగులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ఆర్‌బీడీ ప్లేట్‌లెట్స్‌ బ్యాగుకు ప్రస్తుతం 12వేలను చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు. రోగి గ్రూపునకు సంబంధించిన బ్లడ్‌ డోనర్‌ల కోసం బాధితులు గాలిస్తున్నారు. సోషల్‌ మీడియా లో రక్తదాతల కోసం సంప్రదిస్తుండడం సహజంగా మారింది.

అడ్డగోలుగా బిల్లుల వసూలు...

జిల్లాకేంద్రంతో పాటు భైంసాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగ్యూ జ్వర బాధితుల నుంచి అడ్డగోలుగా వేల రూపాయల్లో బిల్లు లు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి ప్రైవేటు ఆసు పత్రులు రసీదులు ఇవ్వకుండానే తెల్ల కాగితంపై ఇష్టానుసారంగా బి ల్లులు వేసి చెల్లించే వరకు రోగిని డిచార్జ్‌ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ తీరుపై నియంత్రణ లేకపోవ డం సంబంధిత శాఖల అధికారులు ఈ ఆసుపత్రుల దోపిడీని పట్టించుకోకపోతుండడంతో వ్యవహారమంతా ఇష్టానుసారంగా సాగుతోం ది. మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రక్తపరీక్షలు, మందుల రూపంలో కూడా వేల రూపాయల్లో బిల్లులు వేసి బాధితులను కుంగదీస్తున్నాయన్న విమర్శలున్నాయి. 

పొంతన లేని సర్కారు లెక్కలు.... 

జిల్లావ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలతో పా టు ఇతర వైరల్‌ జ్వరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నా వైద్యారోగ్య శాఖ అధికారు లు మాత్రం తీవ్రతపై పెద్ద గా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. వాస్తవ లెక్కలకు సంబంధిత శాఖ చెబుతున్నా లెక్కలకు ఎక్కడ పొంతన కుదరడం లేదన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రులన్ని డెం గ్యూ జ్వర పీడితులతో నిండిపోయి కిటకిటలాడుతుండగా వైద్యారోగ్య శాఖ మాత్రం ఈ జ్వరాలన్నీ వైరల్‌ జ్వరాలు మాత్రమే అంటూ కొట్టి పారేయడం విమర్శలకు తావిస్తోంది. వైద్యారోగ్య శాఖ చెప్పే లెక్కలను ఇక్కడి స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రంలోని ప్లేట్‌లెట్‌ల విక్రయ సంఖ్యను పోల్చితే తేడా వందల సంఖ్యల్లో కనిపిస్తోంది. సం బంధిత శాఖ లెక్కలు వాస్తవానికి విరుద్ధుంగా ఉన్న కారణంగా పేద రోగులకు న్యాయం జరగడం లేదని దీంతో పాటు కొన్ని ప్రైవేటు ఆసు పత్రుల దోపిడీకి అడ్డు అదుపు లే కుండా పోతోందని పే ర్కొంటున్నారు.