రాష్ట్రానికి సహాయ నిరాకరణ ఒక రాజకీయ కుట్ర

ABN , First Publish Date - 2021-12-08T05:41:52+05:30 IST

దేశానికి అన్నం పెట్టే అన్నదాత లను ఆదుకునే బాధ్యతలను మర్చిన కేంద్రం, రాష్ట్రానికి సహాయ ని రాకరణ పేరుతో ఒక రాజకీయ కుట్ర తెరలేపిందని జగిత్యాల వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు ఆరోపిం చారు.

రాష్ట్రానికి సహాయ నిరాకరణ ఒక రాజకీయ కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్‌

జగిత్యాల ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌ రావు 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 7: దేశానికి అన్నం పెట్టే అన్నదాత లను ఆదుకునే బాధ్యతలను మర్చిన కేంద్రం, రాష్ట్రానికి సహాయ ని రాకరణ పేరుతో ఒక రాజకీయ కుట్ర తెరలేపిందని జగిత్యాల వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు ఆరోపిం చారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్‌ల తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక చొరవతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, రైతుల పక్షపాతి ప్రభుత్వంగా తెలంగాణ ప్రజల మన్ననలు పొందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తె లంగాణలో పండించిన ధాన్యం కొనబోమని ప్రకటించి, రైతులను ఆ గం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గోదాములు ఖాళీ చే యకుండా రాష్ట్రంపై కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుందన్నారు. స మస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్న, రాష్ట్ర ప్రభు త్వంపై కేంద్రం రాజకీయ కుట్రలు చేస్తోందని, ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుందని దామోదర్‌ రా వు విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీ అర్వింద్‌  పార్లమెం ట్‌ సాక్షిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం దారుణం అన్నారు. కేం ద్ర ప్రభుత్వ వైఖరితో యావత్‌ తెలంగాణ రైతాంగం ఆందోళన చెం దుతుందన్నారు. గత ఎనిమిది రోజులుగా పార్లమెంట్‌ సాక్షిగా టీఆర్‌ ఎస్‌ ఎంపీలు రైతుల కోసం లడాయి చేస్తే, కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు స్పందించకుండా మిన్నుకుండిపోవడం రైతులు గమనించాలని కోరా రు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ చొరవతో రైతు సమస్యల పరి ష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పీఏ సీఎస్‌ ఛైర్మెన్‌లు పత్తిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, అన్న మనేని సందీప్‌ రా వు, గుర్నాథం మల్లారెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రైతు బంధు సమన్వ య సమితి మండల అధ్యక్షుడు రవీంధర్‌రెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2021-12-08T05:41:52+05:30 IST