హిందీ రాదని బ్యాంకు లోన్ ఇవ్వలేదు: తమిళ్ డాక్టర్

ABN , First Publish Date - 2020-09-23T01:58:20+05:30 IST

అరియలూర్‌లోని గంగైకొండచోలపురం శాఖ అయిన ఓ జాతీయ బ్యాంకులో బాలసుబ్రహ్మణ్యం (76) అనే వైద్యులు లోన్ కోసం వెళ్లాడు. అయితే ఆయనకు హిందీ రాదనే కారణంలో బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వడానికి

హిందీ రాదని బ్యాంకు లోన్ ఇవ్వలేదు: తమిళ్ డాక్టర్

చెన్నై: ‘‘బ్యాంకు లోన్ కావాలంటే భాష రావాలనే విషయం మీకు తెలుసా? అవును.. ఎవరైనా బ్యాంకు లోన్ తీసుకోవాలనుకుంటే తప్పని సరిగా హిందీ నేర్చుకోండి. లేదంటే లోన్ వచ్చే అవకాశాలు తక్కువ’’ ఇలాంటి అనుమానాలు ఇప్పుడు విస్తృతమయ్యాయి. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన దీనికి ఆజ్యం పోసింది. తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడికి ఎదురైన చిత్రమైన అనుభవమిది.


అరియలూర్‌లోని గంగైకొండచోలపురం శాఖ అయిన ఓ జాతీయ బ్యాంకులో బాలసుబ్రహ్మణ్యం (76) అనే వైద్యులు లోన్ కోసం వెళ్లాడు. అయితే ఆయనకు హిందీ రాదనే కారణంలో బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వడానికి నిరాకరించాడని బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. దీంతో బ్యాంకు మేనేజర్‌కు లాయర్ ద్వారా నోటీసులు కూడా ఇచ్చాడట. అంతే కాకుండా బ్యాంకుకు వెళ్లిన సమయంలో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు, దానికి లక్ష రూపాయల పరిహారం కోరుతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.


పరిహారం చెల్లించకపోతే అరియలూర్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తామని నోటీసులో బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నోటీసు కాపీని బ్యాంక్ ప్రధాన ఫిర్యాదుల పరిష్కార అధికారికి పంపినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-09-23T01:58:20+05:30 IST