Abn logo
Sep 26 2021 @ 00:33AM

ఎన్టీపీసీని సందర్శించిన డెన్మార్క్‌ ఎనర్జీ బృందం

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను సందర్శించిన డెన్మార్క్‌ బృందం

- భారత్‌, డెన్మార్క్‌ ఇంధన భాగస్వామ్యంలో భాగంగా స్టడీ టూర్‌ 

- సాంకేతిక అంశాలపై అధ్యయనం

జ్యోతినగర్‌, సెప్టెంబరు 25 : డెన్మార్క్‌కు చెందిన డేనిష్‌ ఎనర్జీ ఏజెన్సీ బృంధం శనివారం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించింది. ఇండియా-డెన్మార్క్‌ ఎనర్జీ పార్టనర్‌షిప్‌లో భాగంగా ఎన్టీపీసీలోని ఫ్లెక్సిబిలైజేషన్‌, వృధా ఇంధన(హీట్‌) రికవరీ లాంటి సాంకేతిక అంశాలపై అద్యయనం చేసేదుకు హైలెవెల్‌ డేనీష్‌ ఎనర్టీ టీం ఇక్క డికి వచ్చింది. డెన్మార్క్‌ బృందానికి ఎన్టీపీసీ సీజీఎం సునిల్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీఐపీ గెస్ట్‌హౌజ్‌లో ఘన స్వాగతం పలికారు. ఉదయం నుంచి రాత్రి వరకు డేనీష్‌ టీం ఎన్టీపీసీలోని వివిధ ప్రాం తాలను సందర్శించారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు సందర్శనకు ముందు ఓఅండ్‌ఎం సమావేశ మందిరంలో డెలిగేషన్‌తో ఏజీఎం మనోజ్‌కుమార్‌ ఝా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్యుత్‌ రంగం, దక్షిణాదిలో పవర్‌ జనరేషన్‌, రామగుండం ప్రాజెక్టు విశేషా లను ఏజీఎం వారికి వివరించారు. తరువాత  ఆ టీం 500మెగావాట్ల 7వ యూనిట్‌ను సందర్శించారు. యూనిట్‌ కంట్రోల్‌ రూంలో యూని ట్‌ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే డేనీష్‌ బృంధం నిర్మాణంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ)లోని ఫ్లూగ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌(ఎఫ్‌జీడీ) ప్లాంటున్న పరిశీలించారు. టౌన్‌షిప్‌ సమీపం లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన మియావాకీ ట్రీ ప్లాంటేషన్‌ను బృందం పరిశీలించింది. అనంతరం డెలిగేషన్‌ రిజర్వాయర్‌లో నిర్మిస్తు న్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటును సందర్శించారు. జీఎంలు ప్రసేన్‌జిత్‌ పాల్‌, పీకే లాడ్‌, అనిల్‌కువూర్‌లు ఆయా ప్రాజె క్టు విశేషాలను వారికి వివరించారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో 9 సభ్యుల డెన్మార్స్‌ బృందం మొక్కలు నాటారు. అనంతరం వారు హైదరాబాద్‌ కు తరలివెళ్లారు.