కొయ్యూరులో దట్టంగా మంచు

ABN , First Publish Date - 2022-01-17T06:28:22+05:30 IST

మండలంలో రెండు రోజులుగా ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టమైన మంచు కురిసింది.

కొయ్యూరులో దట్టంగా మంచు
కొయ్యూరులో కురుస్తున్న మంచు


కొయ్యూరు, జనవరి 16: మండలంలో రెండు రోజులుగా ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టమైన మంచు కురిసింది. సంక్రాంతికి నగరాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు మంచు అందాలను ఆస్వాదించారు. ఇదే తరహాలో మంచు మరికొన్ని రోజులు కొనసాగితే జీడిమామిడి, మామిడి పూతలకు నష్టం వాటిల్లి ప్రమాదం ఉందనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. 

 

 

Updated Date - 2022-01-17T06:28:22+05:30 IST