Abn logo
Jul 6 2020 @ 04:59AM

‘నాడు-నేడు’ పనులను త్వరగా పూర్తి చేయాలి : డీఈవో

పెద్దారవీడు, జూ లై 5 : పెద్దారవీడు మండలంలోని 27 పాఠశాలల్లో ‘నాడు- నేడు’లో భాగంగా జ రుగుతున్న అభివృ ద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని డీ ఈవో సుబ్బారావు అ న్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఆదివారం ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల చివరికల్లా పనులు పూర్తి చే యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని డీఈవో ఉపాధ్యా యులకు సూచించారు. అలాగే మండలంలోని  మురారిపల్లె గ్రామంలో మోడల్‌ పాఠశాల భవ నాల నిర్మాణపు పనులను పరిశీలించారు. 


 వైఎస్సాఆర్‌ టీఎఫ్‌ వినతి 

 నాడు-నేడు పనుల్లో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సాఆర్‌ టీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ డి మాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈవో సుబ్బారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ రమణయ్య, నాయ కులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement