మొబైల్‌ వ్యాలెట్లో రూ.2 లక్షల వరకు జమ!

ABN , First Publish Date - 2021-04-08T06:04:09+05:30 IST

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్లలో రూ.2 లక్షల వరకు జమ చేసుకునే అవకాశం ఆర్‌బీఐ కల్పించ నుంది

మొబైల్‌ వ్యాలెట్లో రూ.2 లక్షల వరకు జమ!

త్వరలో వ్యాలెట్ల మధ్య నేరుగా నగదు బదిలీ!! 


డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్లలో  రూ.2 లక్షల వరకు జమ చేసుకునే అవకాశం ఆర్‌బీఐ కల్పించ నుంది. ప్రస్తుతం ఆ పరిమితి లక్ష రూపాయలే. అంతేకాదు సర్వీస్‌ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ఒక మొబైల్‌ వ్యాలెట్‌ నుంచి మరొక  మొబైల్‌ వ్యాలెట్‌కు నేరుగా నగదు బది లీ చేసుకునే అవకాశం కూడా కల్పించనుంది. ఇందుకోసం పూర్తి కేవైసీ (వినియోగదారు ధ్రువీకరణ ప్రక్రియ) పీపీఐలతోపాటు పీఓఎస్‌ యంత్రాలు, ఏటీఎంలు, క్యూఆర్‌ కోడ్స్‌, బిల్‌ పేమెంట్‌ టచ్‌ పాయింట్స్‌ వంటి చెల్లింపుల స్వీకరణ కేంద్రాలకు ఇంటరాపరబిలిటీని తప్పనిసరి చేసింది.

Updated Date - 2021-04-08T06:04:09+05:30 IST