Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘యురేనియం’ పాంతంలో కుంగిన భూమి

వేముల, డిసెంబ రు 7: యురేని యం ప్రభావిత గ్రామాలైన మ బ్బు చింతలపల్లె రైతు లావనూరు దామోదర్‌రెడ్డి భూమిలో సుమా రు 15అడుగుల లోతు బూమి కుంగడంతో ప్రజ లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. యురేనియం ప్రాజెక్టులో అండర్‌మైనింగ్‌ జరుగుతుండడంతో భూమి లోపల తవ్వుతూ చా లా దూరం వెళ్లారని అందువల్ల మైనింగ్‌ బ్లాసింగ్‌ సమయంలో ఇలా భూమి కుంగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

గతంలో కూ డా పలువురు రైతుల పొలాల్లో గోతులు పడ్డాయని, కానీ యురేని యం అధికారులు వీటికి ప్రాజెక్టులో జరిగే అండర్‌ మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేదని అనడం కొసమెరుపు. అయితే యురే నియం అధికారులు గ్రామాల్లో పడుతున్న గోతుల పట్ల గ్రామస్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యురేనియం అధికారులు మాత్రం వాటి గురించి పట్టించుకోకపో వడం తమ పొలాల్లో గోతులు పడ్డాయని రేపోమాపో తమ ఇళ్లలో కూడా గోతులు పడినా ఆశ్చ ర్యంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వస్తే మీకు న్యాయం జరుగుతుందని మీ కుటుంబాలు బాగుపడతాయని గ్రామాల్లో తిరిగి చెప్పిన అధికారులు, నేతలు ఇప్పుడు తమకు కష్టం వస్తే పట్టించుకునే వారేలేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యురేనియం ప్రాజెక్టు మూసివేయాలి

ప్రధాని మోదీకి కుంచెం లేఖ 

వేంపల్లె, డిసెంబరు 7: ప్రజలు, పశుపక్షాదులు, పంటలకు ఇబ్బందికరంగా మారిన యురేనియం కర్మాగారాన్ని మూసివేయా లని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వేముల మండ లంలోని యురేనియం కర్మాగారంతో నీరు కలుషి తమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు దెబ్బతింటు న్నాయని ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని యురేనియం కర్మాగారాన్ని మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement