ప్రతీదానికి ఎస్సీ కార్డు వాడటం పద్ధతి కాదు : నారాయణ స్వామి

ABN , First Publish Date - 2020-09-30T03:22:45+05:30 IST

ప్రతి చిన్న విషయానికి ఎస్సీ కార్డు వాడటం పద్ధతి కాదని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హితవు పలికారు. తెలుగుదేశం

ప్రతీదానికి ఎస్సీ కార్డు వాడటం పద్ధతి కాదు : నారాయణ స్వామి

తిరుపతి: ప్రతి చిన్న విషయానికి ఎస్సీ కార్డు వాడటం పద్ధతి కాదని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హితవు పలికారు. తెలుగుదేశం పరిపాలనలో దళితులపై ఎన్ని దాడులు జరిగినా చంద్రబాబుకు కనిపించ లేదన్నారు. మాజీ జడ్జి రామకృష్ణ  తమ్ముడు రామచంద్ర పండ్ల వ్యాపారులతో గొడవ చేస్తున్నప్పుడు అటువైపు వచ్చిన టీడీపీ నేత  ప్రతాప్ రెడ్డి  దాడి చేశారన్నారు. సీఎం చేయించిన విచారణలో అతడిపై దాడికి వ్యక్తిగత కారణం అని  తేలిందని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతనిపై దాడి చేయించాడని డీజీపీకి లేఖ ఇవ్వటం చంద్రబాబుకు తగదన్నారు.

Updated Date - 2020-09-30T03:22:45+05:30 IST