Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబుపై మరోసారి డిప్యూటీ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దుష్టపాలనను అంతమొందించడానికే భగవంతుని స్వరూపంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నాణ్యతలేని రోడ్లు వేసి దోచేసుకున్నారని ఆరోపించారు. కాబట్టే ఆ వరుణదేవుడు కూడా ఓర్చుకోకుండా వారికి బుద్ధి రావడానికి రోడ్లను ఇలా పాడు చేసాడని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ లేనప్పుడు  రెచ్చగొట్టేలా ప్రవర్తించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. గొడ్డలి, బాబాయ్, చెల్లి, తల్లి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడింది చంద్రబాబేనన్నారు. అందుకే మాధవ రెడ్డి, వంగవీటి మోహన రంగా హత్యలపై విచారణ జరిపించాలని వైసీపీ కోరిందన్నారు. దాంతో చంద్రబాబు జీర్ణించు కోలేక పవిత్రమైన భార్యను తెర పైకి తీసుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసుకున్నారని విమర్శించారు. 

Advertisement
Advertisement