ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, చిరంజీవి కుటుంబాలపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-02T01:33:13+05:30 IST

బీజేపీ, టీడీపీ, సినిమా రంగాలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటైన

ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, చిరంజీవి కుటుంబాలపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు: సినిమా రంగం వివాదంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సామాన్య పేద ప్రజలకు వినోదం కల్పించేందుకు సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ఆ రంగ ప్రముఖులు ప్రభుత్వంపై విరుచుకు పడడం అన్యాయమన్నారు. రాజకీయ వారసత్వం అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్న వారు.. సినిమా రంగంలోనే అసలైన వారసత్వం హవా నడుస్తోందనేది గ్రహించాలని ఆయన చురకలు అంటించారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, చిరంజీవి కుటుంబాల వారే.. సినిమా వారసత్వ హవాను కొనసాగిస్తున్నారన్నారు. మిగిలిన కులాల్లో ఎంత టాలెంట్ ఉన్నా వారిని ఎదగనీయకుండా చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. 


జగన్‌ను ఇక ఏమీ చేయలేమనే నిర్ణయానికి వచ్చిన ఇతర పార్టీలు ఏకమై జగన్‌పై ఎదురు దాడికి దిగాయని ఆయన ఆరోపించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి ఓట్లు అడిగే పరిస్థితికి విచ్చేశారన్నారు. సోము వీర్రాజు మందు, డబ్బు ఇచ్చి ఓట్లు అడిగే పరిస్థితికి బీజేపీ దిగజారడం దారుణమన్నారు. ఇలాంటి చర్యపై ప్రధాని మోదీ కూడా స్పందించకపోవడం అంటే వారికి మతపిచ్చి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ 75 ఏళ్ల లో నిజమైన స్వాతంత్రం మహిళలకు ఇప్పుడే వచ్చిందన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇప్పుడే రాజకీయ స్వాతంత్రం, పేదవాడికి విద్యా స్వాతంత్రం జగన్ నేతృత్వంలోని వైసీపీ ద్వారానే సిద్ధించిందన్నారు. 

Updated Date - 2022-01-02T01:33:13+05:30 IST