Panchkula CBI court: రంజిత్‌సింగ్ హత్య కేసులో డేరా చీఫ్ గుర్మీత్ దోషి

ABN , First Publish Date - 2021-10-08T18:50:05+05:30 IST

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను మరో హత్య కేసులో దోషిగా పంచకుల సీబీఐ కోర్టు నిర్ధారించింది...

Panchkula CBI court: రంజిత్‌సింగ్ హత్య కేసులో డేరా చీఫ్ గుర్మీత్ దోషి

పంచకుల: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను మరో హత్య కేసులో దోషిగా పంచకుల సీబీఐ కోర్టు నిర్ధారించింది. 2002 సంవత్సరంలో హత్యకు గురైన రంజిత్ సింగ్  కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ఐదుగురు నిందితులు దోషులని పంచకుల సీబీఐ కోర్టు శుక్రవారం తేల్చింది.డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మద్దతుదారు అయిన రంజిత్ సింగ్ 2002 జులై 10 న హత్యకు గురయ్యాడు.2003 డిసెంబరు 3న ఈ హత్య కేసును సీబీఐ విచారణకు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.రంజిత్ సింగ్ కుమారుడు జగసీర్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.


పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఐపీసీ సెక్షన్ 302  కింద గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ఐదుగురు సహ నిందితులను దోషులుగా నిర్ధారించింది. అక్టోబర్ 12 న కోర్టు ఈ దోషులకు శిక్షను ప్రకటించనుంది.గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.


Updated Date - 2021-10-08T18:50:05+05:30 IST