దేశీ డేటింగ్ యాప్‌లో 10 మిలియన్లు దాటిన యూజర్లు!

ABN , First Publish Date - 2020-08-10T21:03:01+05:30 IST

కొవిడ్-19 లాక్‌డౌన్ వేళ దేశీ డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్‌లో భారత యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది.

దేశీ డేటింగ్ యాప్‌లో 10 మిలియన్లు దాటిన యూజర్లు!

బెంగళూరు: కొవిడ్-19 లాక్‌డౌన్ వేళ దేశీ డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్‌లో భారత యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. తమ యాప్‌లో భారత యూజర్లు ప్రస్తుతం కోటి మందికి పైగా ఉన్నట్టు కంపెనీ ఇవాళ వెల్లడించింది. లాక్‌డౌన్ సమయంలో కేవలం రెండు నెలల్లోనే తమ యాప్‌లో పది లక్షల మంది యూజర్లు వచ్చి చేరారని సదరు యాప్ వెల్లడించింది. ‘‘లాక్‌ సమయంలో రోజుకు దాదాపు పది లక్షల మంది ఆసక్తి కనబర్చగా.. ప్రతిరోజూ 30 లక్షల ప్రొఫైల్ వ్యూస్ వచ్చాయి...’’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్వాక్‌క్వాక్ వ్యవస్థాపకుడు రవి మిట్టల్ మాట్లాడుతూ... ‘‘భారత్‌లో ఒంటరిగా ఉంటున్న వారి కోసం మేము స్వదేశీ డేటింగ్ యాప్ రూపొందించాం. ఇవాళ 10 మిలియన్ల మందితో మాకంటూ సొంతగా ఓ చిన్నపాటి కమ్యూనిటీ ఏర్పడింది...’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-10T21:03:01+05:30 IST