Abn logo
Oct 24 2021 @ 19:12PM

12 ఏళ్ల బాలికకు ఫేమస్ అవ్వాలని కోరిక.. అందుకోసం 13 ఏళ్ల స్నేహితుడితో కలిసి ఎవరూ చేయరాని పని చేసింది..

యుక్త ప్రాయం వచ్చే క్రమంలో ఒక్కొక్కరికి ఒక్కో రకం కోరికలు పుడుతుంటాయి. కొందరికి బాగా చదువుకుని ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఉంటుంది. మరికొందరు బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలిక కూడా అలాంటి కోవకే చెందుతుంది. ఆమెకు బాగా ఫేమస్ అవ్వాలని తపన. అందుకోసం 13 ఏళ్ల స్నేహితుడితో కలిసి ఎవరూ చేయరాని పని చేసింది... వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నీఫ్‌ లూయిజ్ వెర్లాంగ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. వీరి 12 ఏళ్ల బాలిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే పాఠశాలలో 13ఏళ్ల బాలుడిని ప్రేమించింది. ఆమెకు మొదటి నుంచి బాగా ఫేమస్ అవ్వాలని కోరిక ఉండేది. ఈ క్రమంలో టీవీలో ఓ వార్త చూసింది. 2002లో సుసాన్ లూయిస్ అనే అమ్మాయి స్నేహితులతో కలిసి తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. దీంతో ఆమె అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్ననీఫ్‌ కుమార్తె.. తాను కూడా అలా ఫేమస్ అవ్వాలని కోరుకుంది. అప్పటి నుంచి తనకు తాను.. ఓ కిల్లర్‌లా ఊహించుకుంది.

ఈ క్రమంలో ఓ రోజు తన తండ్రిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన ప్రియుడిని కూడా సాయం కోరింది. అతను అంగీకరించడంతో ఇద్దరూ కలిసి కుట్ర పన్నారు. నిద్రపోతున్న తన తండ్రి మెడపై కత్తితో పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకుని విచారించారు. బాలికను, బాలుడని అదుపులోకి తీసుకున్నారు. వారిలో హత్య చేశామనే పశ్చాత్తాపం కూడా వారిలో లేకపోవడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. మొత్తానికి తాము ఫేమస్ అయ్యామనే ఆనందంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి గురించి తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...