డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ నుంచి వీడియో,వాయిస్‌ కాల్స్‌

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

ఇప్పుడు కమ్యూనికేషన్‌ అనే పదానికి వాట్సాప్‌ దాదాపుగా పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తికాదు. స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు వెబ్‌ వాట్సాప్‌ ద్వారా దీనిని డెస్క్‌టాప్‌లోనూ ఉపయోగించవచ్చు అనే విషయం తెలిసిందే. ...

డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ నుంచి వీడియో,వాయిస్‌ కాల్స్‌

ఇప్పుడు కమ్యూనికేషన్‌ అనే పదానికి వాట్సాప్‌ దాదాపుగా పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తికాదు.  స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు వెబ్‌ వాట్సాప్‌ ద్వారా దీనిని డెస్క్‌టాప్‌లోనూ ఉపయోగించవచ్చు అనే విషయం తెలిసిందే.  అయితే స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉండవు. ఒక్కో ఫీచర్‌ను వాట్సాప్‌ డెస్క్‌టాప్‌నకు యాడ్‌ చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం కాంటాక్ట్‌ లిస్టులోని వారికి వీడియో, వాయిస్‌ కాల్స్‌ డెస్క్‌టాప్‌ నుంచీ చేసుకోవచ్చు.  అయితే ఇంకా గ్రూప్‌ కాల్స్‌కు అవకాశం ఈ విధానంలో లేదు. డెస్క్‌టాప్‌ నుంచే వాయిస్‌, వీడియోకాల్స్‌ చేసుకోవాలంటే విండోస్‌ 10, 64-బిట్‌ వెర్షన్‌ 1903, మేక్‌ ఓఎస్‌10.13 న్యూయర్‌ ఉండాలి. కంప్యూటర్‌ కెమెరా, మైక్రోఫోన్‌కు వినియోగదారుడు యాక్సెస్‌ ఇవ్వాలి. అయితే వీటితో గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే వెసులుబాటు మాత్రం ఉండదు. ముందు డెస్క్‌టాప్‌పై వాట్సాప్‌తో కనెక్ట్‌ కావాలి. తదుపరి...వాయిస్‌ కాల్‌ కోసం ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో, సదరు కాంటాక్ట్‌ను ఓపెన్‌ చేయాలి. వాయిస్‌కాల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. కాల్‌ సమయంలో మీ ఇష్టాన్ని అనుసరించి మైక్రోఫోన్‌ ఐకాన్‌ను మ్యూట్‌ లేదంటే అన్‌మ్యూట్‌లో పెట్టుకోవచ్చు.  కాల్‌ ముగించడానికి గాను ‘ఎండ్‌ కాల్‌’ను క్లిక్‌ చేయాలి.వీడియో కాల్‌ కోసంఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో, సదరు కాంటాక్ట్‌ను ఓపెన్‌ చేయాలి.వీడియోకాల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి.  కాల్‌ సమయంలో మీ ఇష్టాన్ని అనుసరించి మైక్రోఫోన్‌ ఐకాన్‌ను మ్యూట్‌ లేదంటే అన్‌మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. కాల్‌ ముగించడానికి గాను ‘ఎండ్‌ కాల్‌’ను క్లిక్‌ చేయాలి. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు.



స్టెప్‌ బై స్టెప్‌

 వాయిస్‌ కాల్‌లో ఉన్నప్పుడు అది ఆపేయండని రిక్వెస్ట్‌ చేయవచ్చు. అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు ఓకే లేదా స్విచ్‌ టు స్విచ్‌ కాల్‌ లేదా కేన్సిల్‌ టు డిక్లయిన్‌పై క్లిక్‌ చేయాలి.

 కాల్‌ సమయంలో హోవర్‌ ఓవర్‌(తేలియాడు) ద కెమెరా

 కెమెరా ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి.

 మీరు మాట్లాడుతున్న వ్యక్తి అనుమతిస్తే, వాయిస్‌ కాల్‌ కాస్తా వీడియో కాల్‌గా మార్చుకోవచ్చు. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST