డెస్క్‌టాప్‌ కోసం ప్రత్యేక ఫీచర్లు

ABN , First Publish Date - 2021-11-27T05:45:23+05:30 IST

డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌ యూజర్లకు చాలా ఫీచర్లు అందుబాటులో లేవు. ప్రైవసీ సెట్టింగ్స్‌తో సహా చాలా ఫీచర్లు ఇప్పుడు కొత్తగా చేరాయి....

డెస్క్‌టాప్‌ కోసం ప్రత్యేక ఫీచర్లు

డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌  కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌ యూజర్లకు   చాలా ఫీచర్లు అందుబాటులో లేవు. ప్రైవసీ సెట్టింగ్స్‌తో సహా చాలా ఫీచర్లు ఇప్పుడు కొత్తగా చేరాయి. గతంలో సెట్టింగ్స్‌ను కంట్రోల్‌ చేయాలంటే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలోని వాట్సాప్‌నే ఉపయోగించాల్సి వచ్చేది. దరిమిలా ఈ అప్డేట్‌తో డెస్క్‌టాప్‌పై ప్రైవసీ సెట్టింగ్స్‌ చేసుకునేందుకు వీలుపడుతుంది.


లాస్ట్‌ సీన్‌, ప్రొఫైల్‌ ఫొటో కంట్రోల్‌


బ్లాగ్‌సైట్‌లో షేర్‌ చేసిన స్ర్కీన్‌షాట్‌ ప్రకారం లాస్ట్‌ సీన్‌, ప్రొఫైల్‌ ఫొటో తదితరాలపై డెస్క్‌టాప్‌పైనే యూజర్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌ విషయంలో కంట్రోల్‌ చేయవచ్చు. బటన్‌ను క్లిక్‌ను ఉపయోగించి రీడ్‌ రిసీట్స్‌ను అదుపు చేయవచ్చు. బ్లాక్డ్‌ కాంటాక్ట్‌ను మేనేజ్‌ చేయవచ్చు. గ్రూప్‌ సెట్టింగ్స్‌ యాక్సెస్‌ పొందవచ్చు. లేటెస్ట్‌ బేటా వెర్షన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే ఇవన్నీ వీలుపడతాయి. ఇక్కడ కూడా చేసిన కాల్స్‌, పంపుకొన్న మెసేజ్‌లు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయి. 


అయితే ఈ సెట్టింగ్స్‌ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు లేవు అంటే త్వరలో మీ అకౌంట్‌కు ఆ సెట్టింగ్స్‌ చేరుతాయనే ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2.21.22.7 అప్డేట్‌తో రియాక్షన్‌ నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌ లభ్యమవుతుంది. ఇదే తరహాలో ఐఓఎస్‌ ఆధారిత యాప్‌లోనూ పనిచేస్తోంది. దీంతో ఇతరులకు పంపిన మెసేజ్‌లపై వారి స్పందనలను తెలుసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో మాదిరిగా వాటిపై ఎమోజీలతో తమ రియాక్షన్‌లను పంపుకోవచ్చు.


డిలీట్‌ ఆప్షన్‌

‘పొరపాటున ఒకరికి పంపే మెసేజ్‌ను ఇతరులకు పంపిస్తే యూజర్లకు ఇబ్బంది. అయితే ఆ సమయాల్లో వినియోగదారులను కాపాడేందుకు వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ డిలీట్‌ ఫర్‌ ఎవ్విర్‌వన్‌ ఫీచర్‌ను ఇది వరకే తీసుకు వచ్చింది. దీనిని ఇప్పుడు డెస్క్‌టాప్‌కు అప్లయి చేస్తోంది. ఈ ఏడాది తాజాగా  వ్యూ వన్స్‌ ఇమేజెస్‌ అండ్‌ వీడియోస్‌, ఎండ్‌ టు ఎండ్‌ చాట్‌ బ్యాకప్‌లు మోబైల్‌ యాప్‌నకు చేరాయి. అయితే వీటిని కూడా త్వరలోనే డెస్క్‌టాప్‌కి చేర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


పంపిన మెసేజ్‌ని నిర్ణీత గడువు లోపు డిలీట్‌ అయ్యే అవకాశం వాట్సాప్‌లో ఉంది. అయితే, ఇది డెస్క్‌టాప్‌ బేస్డ్‌ యాప్‌ లేదంటే వాట్సాప్‌ వెబ్‌లో ఈ ఫీచర్‌ లేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే,  డెస్క్‌టాప్‌పై వాట్సాప్‌తో పనిచేసుకుంటున్న వినియోగదారులు అది డిలీట్‌ కావాలంటే తిరిగి తమ స్మార్ట్‌ ఫోన్లలోకి వెళ్ళాలి. అయితే డెస్క్‌టాప్‌పైనా డిలీట్‌ ఫీచర్‌ త్వరలో రానుంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్స్‌ మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది. ఒక గంట, ఎనిమిది నిమిషాలు, పదహారు సెకెండ్లు గడువులోనే ఇవి కూడా డిలీట్‌ అవుతాయి. టైమ్‌ లిమిట్‌ను ఏడు రోజుల నుంచి ఎనిమిది నిమిషాల వరకు గడువుగా నిర్దేశించుకునేందుకు వీలుగా మార్పు చేసే యత్నంలో వాట్సాప్‌ ఉందని సమాచారం. దీనికి తోడు వేరియబుల్‌ ప్లేబ్యాక్‌ స్పీడ్‌ ఆప్షన్‌లోనూ మార్పులు చేసే పనిలో కూడా వాట్సాప్‌ ఉంది.

Updated Date - 2021-11-27T05:45:23+05:30 IST