పట్టాభి అరెస్ట్‌పై వివరాలివ్వండి

ABN , First Publish Date - 2021-10-23T08:56:10+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అరెస్ట్‌ వ్యవహారంలో పోలీసులు కోర్టు ముందు ఉంచిన 41ఏ నోటీసుల విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకపోయినా రిమాండ్‌కు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.

పట్టాభి అరెస్ట్‌పై వివరాలివ్వండి

  • పోలీసుల తరఫు పీపీకి హైకోర్టు ఆదేశం 
  • బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ 

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అరెస్ట్‌ వ్యవహారంలో  పోలీసులు కోర్టు ముందు ఉంచిన 41ఏ నోటీసుల విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకపోయినా రిమాండ్‌కు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని ఆదేశించింది. బెయిల్‌ పిటిషన్‌పై శనివారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఆదేశాలిచ్చారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.... బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. 

Updated Date - 2021-10-23T08:56:10+05:30 IST