త్వరలో అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు: వెలంపల్లి

ABN , First Publish Date - 2021-08-02T08:29:58+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా త్వరలో సంక్షేమ పథకాలను నేరుగా అందజేసే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం

త్వరలో అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు: వెలంపల్లి

గుంటూరు, ఆగస్టు 1: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా త్వరలో సంక్షేమ పథకాలను నేరుగా అందజేసే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.  ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన లేళ్ల అప్పిరెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం గుంటూరులో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న పేద మహిళలకు కాపు నేస్తం తరహాలో పథకాన్ని త్వరలో వర్తింపజేయనున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-08-02T08:29:58+05:30 IST