రాయుడు విషయంలో తప్పుచేశాం

ABN , First Publish Date - 2020-11-22T09:17:40+05:30 IST

వరల్డ్‌కప్‌నకు అంబటి రాయుడును ఎంపిక చేయక పోవడం తమ తప్పిదమేనని మాజీ సెలెక్టర్‌ దేవంగ్‌ గాంధీ అంగీకరించాడు

రాయుడు విషయంలో తప్పుచేశాం

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌నకు అంబటి రాయుడును ఎంపిక చేయక పోవడం తమ తప్పిదమేనని మాజీ సెలెక్టర్‌ దేవంగ్‌ గాంధీ అంగీకరించాడు. టీమ్‌ సెలెక్షన్‌ సమయంలో సరైన జట్టునే ఎంపిక చేశామని అనిపించింది కానీ, ఆ తర్వాత చేసిన పొరబాటు అర్ధమైందని చెప్పాడు. కాగా, సూర్యకుమార్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయకపోవడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘ఒక స్థానం కోసం నలుగురు పోటీపడే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని పక్కనబెట్టి సూర్యకు అవకాశం కల్పించాలో ఆ విమర్శలు చేస్తున్న వారే చెప్పాలి. యాదవ్‌ ప్రతిభావంతుడు.. చాన్స్‌ వచ్చేదాకా ఓర్పుతో వేచి ఉండాలి’ అని గాంధీ సూచించాడు. 

Updated Date - 2020-11-22T09:17:40+05:30 IST