Abn logo
Sep 20 2021 @ 23:19PM

రెండేళ్లలో రూ.15 కోట్లతో అభివృద్ధి చేశా

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

జోగిపేట, సెప్టెంబరు 20 : రెండేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అందోలు-జోగిపేట అభివృద్ధిలో సుస్పష్టమైన మార్పును తీసుకురాగలిగామని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. సోమవారం, తన క్యాంపు కార్యాలయంలో 12వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ నాగరాజు సహా పలువురిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయ్యే నాటికి జంట పట్టణాలు మురికి కూపాలుగా ఉండేవని, గత రెండేళ్లలో ప్రతీ వార్డులోనూ సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీని రూ.15 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ, మున్సిపల్‌ చైర్మన్లు మల్లికార్జున్‌గుప్తా, జి.మల్లయ్య, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు హెచ్‌.రామాగౌడ్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం పాల్గొన్నారు.