Abn logo
Sep 23 2021 @ 23:53PM

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా చిత్రంలో ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌ విజయరామరాజు తదితరులు

డిప్యూటీ సీఎం, ఇన్చార్జి మంత్రి
జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 23:
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో కలెక్టర్‌ విజయరామరాజు ఆధ్వర్యంలో మంత్రులు, జాయింట్‌ కలెక్టర్లు, అన్నిశాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో అఽధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొవిడ్‌ కష్టకాలంలో అందిస్తూనే.. మరో పక్క కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి నడిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం 23.9 శాతం నమోదు కావడంతో జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయన్నారు. అనంతరం సంబంధిత జాయింట్‌ కలెక్టర్ల పర ్యవేక్షణలో శాఖల వారీగా జిల్లాలో సాధించిన ప్రగతిని కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ప్రజెంటేషన ద్వారా మంత్రులకు వివరించారు. అలాగే శాఖల వారీగా ప్రగతి నివేదికలను కలెక్టర్‌ వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ జి.శ్రీకాంత రెడ్డి, ప్రభుత్వ విప్‌ కె.శ్రీనివాసులు, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, జకియఖానం, ఎమ్మెల్యేలు రవీంధ్రనాథరెడ్డి, మల్లిఖార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబుజాయింట్‌ కలెక్టర్లు ఎం.గౌతమి, సీఎం సాయికాంత వర్మ, ధ్యానచంద్ర, ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మలోల, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాఽధాన్యత
మీడియాతో ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహన రెడ్డి విద్య, వైద్యం, వ్యసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. జిల్లా సమీక్షా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలను, వైద్యశాలలను ఆధునీకరించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు విద్యవ్యాపారం కాకూడదని, పేదరికం విద్యకు అడ్డు కాకూడదని గ్రాంట్‌ ఇన ఎయిడెడ్‌ కింద నడపబడుతున్న పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల అధ్యాపక బృందాన్ని ప్రభుత్వం సరెండరు చేసుకొని పాఠశాలల్లో వారిని నియమించే ఆలోచనల్లో ఉందన్నారు. పెన్షన్లు తీసేశారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, బోగస్‌ పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామన్నారు. జిల్ల్లాలోని చెరువులు అన్యాక్రాంతం అవుతున్నట్లు ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు.