టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి వెనక్కి

ABN , First Publish Date - 2021-06-18T07:04:38+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పది సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసగిస్తో ందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు రాథోడ్‌ రమేష్‌ విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి వెనక్కి
మస్కాపూర్‌లో కార్యక్రమంలో మాట్లాడుతున్న రమేష్‌రాథోడ్‌

కుటుంబ, గడీల పాలనకు రోజులు దగ్గర పడ్డాయి 

ఖానాపూర్‌ రూరల్‌, జూన్‌ 17 : టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పది సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసగిస్తో ందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు రాథోడ్‌ రమేష్‌ విమర్శించారు. ఖానాపూర్‌ మండలంలోని మస్కాపూర్‌లో గురువారం బీజేపీ పరిచయ కార్యక్రమ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రం ఎంతగా నో అభివృద్ది జరుగుతుందని భావించామని, కానీ రాష్ట్రం దొరలచేతిలోకి వెళ్లిందన్నా రు. కుటుంబ, గడీల పాలన కొనసాగుతుందని, నిరుద్యోగ సమస్య పెరిగిందని, కేసీ ఆర్‌ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో టీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందని రాథోడ్‌ రమేశ్‌ జోస్యం చెప్పారు. ఖానాపూర్‌కు ఎన్నికల సమయంలో వచ్చిన సీఎం కేసీఆర్‌.. గిరిజనుల సమస్యలు పరిష్కారిస్తానని.. అటవీభూములకు పట్టాలిప్పిస్తానని, ఆర్‌డీ వో కార్యాలయం ఏర్పాటు చేస్తానని, సదర్‌మాట్‌కు ప్రత్యేకకాలువ నిర్మి స్తామని చెప్పి.. ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా చేయలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తను ఎంపీగా సమయంలో 110ఎకరాల స్థలం కొని పేదవారికి ఇచ్చేందుకు కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్‌, నాయకులు శ్రీరాంనాయక్‌, తోకల బుచ్చన్న యాదవ్‌, నాయిని సంతోష్‌, ప్రకాష్‌, మైలారపు గంగాధర్‌, నిమ్మగడ్డ రవీందర్‌, గోపాల్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

పెంబి, జూన్‌ 17 : కేంద్రంలో నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ సూచించారు. బీజేపీలో చేరిన తరువాత గురువారం పెంబి మండల కేంద్రంలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ కార్య క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తులాల సదాశివ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్‌, మాజీ ఎంపీపీ సల్ల రామే శ్వర్‌రెడ్డి, వెంకటేష్‌, నర్సయ్య, సల్ల నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T07:04:38+05:30 IST