రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : మంత్రి

ABN , First Publish Date - 2021-07-30T05:51:48+05:30 IST

రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : మంత్రి
సూర్యాపేటలో రేషన్‌కార్డులు అందజేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట అర్బన్‌, జూలై 29 : రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆహార భద్రతకార్డులను జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాయలంలో గురువారం పంపిణీ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పేదల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు లేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ. 45 వేల కోట్లతో పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అందుకే పేదల పెన్నిధిగా సీఎం కేసీఆర్‌ నిలిచారన్నారు. రాష్ట్రంలో బీడు భూములను సస్యశ్యామలం చేశామని, ప్రతి ఎకరాకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఉమ్మడినల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు నమోదు కాలేదని, రైతులకు నిరంతరం విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అందజేస్తున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలు కొండంత అండగా నిలిచాయన్నారు. విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో సన్నబియ్యం మరెన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, ఎంపీపీలు బీరవోలు రవీందర్‌రెడ్డి, నెమ్మాది బిక్షం, జడ్పీటీసీలు జీడి బిక్షం, అనిత, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవి, డీఎ్‌సవో విజయలక్ష్మి, తహసీల్దార్లు వెంకన్న, శేషగిరిరావు పాల్గొన్నారు. 

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి 

సూర్యాపేట కల్చరల్‌ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి  రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు కార్మిక బీమా కార్డులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, ఒగ్గు వెంకన్న, పసుపులేటి వెంకన్న, వీరస్వామి, మల్సూర్‌, జానకిరాములు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:51:48+05:30 IST