ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-17T07:06:12+05:30 IST

గ్రామసర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు ఐకమత్యంగా ముందుకుసాగి గ్రామాల అభివృద్దికి బాటలు వేయాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు.

ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి

తాళ్లూరు, అక్టోబరు 16 : గ్రామసర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు ఐకమత్యంగా ముందుకుసాగి గ్రామాల అభివృద్దికి బాటలు వేయాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశంహాలులో శనివారం వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంపై సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు పంతాలకుపోవద్దన్నారు. సమస్యలను ఇరువురు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు.

Updated Date - 2021-10-17T07:06:12+05:30 IST