ముంబై రైల్వే స్టేషన్‌ అభివృద్ధి రేసులో జీఎంఆర్‌

ABN , First Publish Date - 2021-01-16T07:05:01+05:30 IST

మహారాష్ట్రలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ పోటీ పడుతోంది. ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (సీఎ్‌సఎంటీ) రైల్వే స్టేషన్‌ నవీకరణ కోసం జీఎంఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బిడ్‌ దాఖలు చేసింది

ముంబై రైల్వే స్టేషన్‌ అభివృద్ధి రేసులో జీఎంఆర్‌

అదానీ, గోద్రెజ్‌ గ్రూప్‌లతో పోటీ 


ముంబై: మహారాష్ట్రలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ పోటీ పడుతోంది. ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (సీఎ్‌సఎంటీ) రైల్వే స్టేషన్‌ నవీకరణ కోసం జీఎంఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బిడ్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్దతిలో రూ.1,642 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయతలపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ కన్సెషన్‌ కాలపరిమితి 60 ఏళ్లు. గత ఏడాది ఆగస్టులో ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎ్‌సడీసీ).. ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించింది. జీఎంఆర్‌ ఎంటర్‌ప్రైజె్‌సతో పాటు మొత్తం పది కంపెనీలు ఇందుకోసం రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్స్‌ (ఆర్‌ఎ్‌ఫక్యూ) సమర్పించాయని ఐఆర్‌ఎ్‌సడీసీ తెలిపింది. ఇందులో అదానీ రైల్వే ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌, మోరిబస్‌ హోల్డింగ్స్‌ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. విమానాశ్రయాలు, ఇతర రైల్వే స్టేషన్ల కంటే కూడా సీఎ్‌సఎంటీ అభివృద్ధికి కంపెనీలు ఎక్కువ ఆసక్తితో ఉన్నాయని పేర్కొంది. 

Updated Date - 2021-01-16T07:05:01+05:30 IST