తెలంగాణ అభివృద్ధివైపే అందరిచూపు..

ABN , First Publish Date - 2021-10-28T04:23:10+05:30 IST

తెలంగాణ అభివృద్ధివైపే అందరిచూపు..

తెలంగాణ అభివృద్ధివైపే అందరిచూపు..
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

కొడంగల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపట్ల దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రూ.కోటి 22 లక్షలతో నిర్మించిన కస్తూర్భాగాంధీ పాఠశాల భవనాన్ని గురువారం వారు ప్రారంభించారు.  అనంతరం రెడ్డిబసిరెడ్డి ఫంక్షన్‌ హాలులో  నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.  నవంబర్‌ 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన  సభను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు, ఇంటింటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వెనకబడిన కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సీఎం కృషి చేయడం హర్షణీయమన్నారు. విజయగర్జన సభకు ఇంటికో కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు.  ప్రతీ గ్రామానికి ఆర్ఠీసీ బస్సు  ఏర్పాటు చేశామని,  సభకు తరలి రావాలని కోరారు.  సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎంపీపీలు ముద్దప్పదేశ్‌ముఖ్‌, హేమీబాయి, విజయ్‌కుమార్‌, జడ్పీటీసీలు కోట్లమహిపాల్‌, నాగరాణి, అరుణజ్యోతిఛౌహన్‌, పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కోట్లయాదగిరి, ప్రమోద్‌రావు, బాల్‌సింగ్‌నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌గుప్తా, విష్ణువర్ధన్‌రెడ్డి, యం.కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:23:10+05:30 IST