పేదల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా

ABN , First Publish Date - 2021-02-25T05:24:05+05:30 IST

‘పేదల అభివృద్ధే రాష్ట్రప్రభుత్వ ప్రధాన ఎజెండా’ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ అన్నా రు. మండలంలోని రేపాక, పొత్తూర్‌, వల్ల ంపట్లలో రైతువేదికలు, ఇల్లంతకుంటలో సెస్‌పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి ప నులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ప్రారంభించారు.

పేదల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా
సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

 ఇల్లంతకుంట, ఫిబ్రవరి 24:‘పేదల అభివృద్ధే రాష్ట్రప్రభుత్వ ప్రధాన ఎజెండా’ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ అన్నా రు. మండలంలోని రేపాక, పొత్తూర్‌, వల్ల ంపట్లలో రైతువేదికలు, ఇల్లంతకుంటలో సెస్‌పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి ప నులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ప్రారంభించారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటున్నారని, రైతులకు మేలు చేసినందుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎకానమిక్‌ సర్వేలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్న విషయాన్ని గమణించాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో మార్చి 13 నుంచి నిర్వహించనున్న వీఎస్‌ఆర్‌ స్మారక కబడ్డీ, వాలీబాల్‌ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు మండల కేంద్రం నుంచి ప్రతిపాదించిన డీ2 కెనాల్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని రైతులు వినతిపత్రం అందజేశారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, సెస్‌చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, జడ్పీవైస్‌ చైర్మన్‌ వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వేణురావు, సెస్‌డైరెక్టర్‌ అయిలయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనాథ్‌గౌడ్‌, ఫ్యాక్స్‌ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, సర్పంచులు లక్ష్మి, కూనబోయిన భాగ్యలక్ష్మి, సిద్దం శ్రీనివాస్‌, కేతిరెడ్డి అనసూయ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:24:05+05:30 IST