కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-20T04:57:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి
వల్లూరు గ్రామంలో విచారణ జరుపుతున్న భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ పద్మశ్రీ, ఆర్డీఓ అనిల్‌, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ

- కొమిరెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభంలో ఎమ్మెల్యే ఆల 

మూసాపేట, జూలై 19 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా తెలంగాణ క్రీడమైదానం, పాఠశాల అదనపు గదులు, గ్రామ పంచా యతీ భవనం, మహిళ సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ గ్రామాల్లో రాజకీయ లబ్ధికోసం కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అధికారంలోకి రావాలని చూస్తున్నాయని, అలాంటి వారికి గ్రామీణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ముఖ్య మంత్రి సహాయనిధి చెక్‌లను అందజేశారు. 

రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో హైజనిక్‌ కిట్స్‌ పంపిణీ 

మండల పరిధిలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో రెడ్‌క్రాస్‌ పాలమూర్‌ శాఖ ఆధ్వర్యంలో మండల ఆశ కార్యకర్తలకు, పారిశుధ్య కార్మికులకు మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా హైజనిక్‌ కిట్స్‌, టార్పాలిన్లు పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గూపని కళావతి, జడ్పీటీసీ సభ్యుడు ఇం ద్రయ్యసాగర్‌, స్థానిక సర్పంచ్‌ సాయిరెడ్డి, ఎంపీటీసీ సంతోష, సింగిల్‌ విండో అధ్యక్షుడు బండ వెంకటేశ్వర్‌రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు భాస్కర్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సిం హ్మయాదవ్‌, నాయకులు కొండయ్య, మల్లయ్య, నర్సిములుగౌడ్‌, మున్నూరు శ్రీనివాసులు, శివరాములు, అధికారులు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

 ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభాలు

అడ్డాకుల : రైతులు ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని కందూరు గ్రామ శివారులో రైతులు నూతనంగా ఆయిల్‌ ఫామ్‌ తోటలను సాగు చేయడానికి మొక్కలను తీసుకొచ్చారు. ఆ మొక్కలను ఎమ్మెల్యే నాటారు. అక్కడి నుంచి కందూరు గ్రామం నుంచి వెళ్లే మానాజీపేట రోడ్డు పనులను పరిశీలించారు. అదే విధంగా భవాని చెరువు ఫీడర్‌ చానల్‌ను పరిశీలించారు. అంతకు ముందు మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.3,96లక్షల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిఽధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-20T04:57:47+05:30 IST