వేలాలను అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2022-03-02T03:47:04+05:30 IST

వేలాల గట్టు మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గట్టుమల్లన్నను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీతో కలిసి దర్శించు కున్నారు. గుట్టపైకి కొంత దూరం కాలినడకన వచ్చిన మంత్రికి ఒగ్గు పూజా రులు స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వయం భుగా గుహలో వెలిసిన మల్లన్న స్వామి వద్దకు భక్తులు తరలివస్తున్నారన్నారు.

వేలాలను అభివృద్ధి చేస్తాం
గుట్టపైన మల్లన్నను దర్శించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

జైపూర్‌: వేలాల గట్టు మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గట్టుమల్లన్నను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీతో కలిసి దర్శించు కున్నారు. గుట్టపైకి కొంత దూరం కాలినడకన వచ్చిన మంత్రికి ఒగ్గు పూజా రులు స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వయం భుగా గుహలో వెలిసిన మల్లన్న స్వామి వద్దకు భక్తులు తరలివస్తున్నారన్నారు.  అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున శాశ్వత అభివృద్ధి జరగలేదన్నారు. రూ.20 కోట్ల ప్రణాళికతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ రమాదేవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అరవిందరావు, మధుకర్‌రెడ్డి, ఈవో రమేష్‌ పాల్గొన్నారు.

 ఎమ్మెల్యే నిధులు రూ.2 కోట్లతో గ్రామం నుంచి గట్టు మల్లన్న గుట్టపైనున్న ఆలయం వరకు నిర్మించిన సీసీ రోడ్డు పనులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి ప్రారంభించారు. జాతరను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖకు చెందిన ఎకరం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.  

Updated Date - 2022-03-02T03:47:04+05:30 IST