Abn logo
Sep 21 2021 @ 00:22AM

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న నరేందర్‌రెడ్డి

జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి


నల్లగొండ, సెప్టెంబరు 20: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాపరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఒకటో, ఏడో స్థాయీసంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పఽథకాలు మారుమూల గ్రామాలకు సైతం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రెండో, నాలుగో స్థాయీసంఘాల సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మూడో స్థాయీసంఘ సమావేశంలో వ్యవసాయం, ఐదో స్థాయీసంఘ సమావేశంలో స్త్రీశిశు సంక్షేమం, ఆరో స్థాయీసంఘం సమావేశంలో సాంఘిక సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో జడ్పీ సీఈవో వీర బ్రహ్మచారి, ఎమ్మెల్యే నోముల భగత్‌, టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.