Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌  

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన  

- అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం

ధర్మారం, జూన్‌ 3: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిధులను మంజూరు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంత్రి సూచించారు. గురువారం ధర్మారం లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక లక్ష్యంతో అభివృద్ధి చేసెందుకు గాను కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పను లకు శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులన్నింటిని పూర్తి చేసేందకు గాను క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధర్మారంలో 4లైన్ల రోడ్డు నిర్మాణాల్లో నిబంధనల ప్రకారం 70 ఫీట్లతో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్‌ఆండ్‌బీ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఈ నిబంధనలను పాటించకుంటే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవ కాశం ఉంటుందని వీటిని పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు. వైకుంఠధామం నిర్మాణానికి రూ. 25లక్షలు మంజూరు చేసినట్టు మరో రూ.25లక్షల నిఽధులను మంజూరు చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. ధర్మారం గ్రామాభివృ ద్ధికి గతంలో అనేక రకాలుగా నిధులు మంజూరు చేసినట్టు ఆయన వివరించారు. ధర్మారం మండల కేంద్రాన్ని గొప్పగా అభివృద్ధి పరిచేందకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మంత్రి వెంట  స్థానిక సర్పంచ్‌ పూస్కూరి జితెందర్‌రావు, నందిమేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు మేడవేని తిరుపతి, ఎంపీటీసీ సభ్యుడు తుమ్మల రాంబాబు, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ రఫీ, మార్కెట్‌ ఉపాధ్యక్షు డు గూడూరి లక్ష్మణ్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ ఎండీ హాపీజ్‌, ఉపసర్పంచ్‌ ఆవు ల లత తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ది పనులకు శంకుస్థాపన 

ధర్మారం మండల కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మండ ల కేంద్రంలో మల్లికార్జునస్వామి ఆలయం వద్ద సిమెంట్‌ రోడ్డు, 4లైన్ల రోడ్డు నిర్మాణాని, అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌, జూనియర్‌ కళాశాలకు ప్రహారీ గోడ , వైకుంఠధామం నిర్మాణాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శంకుస్థాపన చేశారు. అలాగే మున్నూర్‌ కాపు సంఘం భవనం, పెద్దమ్మ గుడి సమీపంలో సిమెంట్‌ రోడ్డులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. అనంతరం ధర్మారం మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను మంత్రి అందజేశారు. 

అధికారులపై మంత్రి మండిపాటు 

ధర్మారం మండల కేంద్రంలో మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ పర్యటిస్తే మండల స్థాయి అధికా రులు గైర్హాజరయ్యారు. మంత్రి స్వయంగా ధర్మారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుంటే ఒక్క అధికారి కూడా కనిపించలేదు. దీంతో జూనియర్‌ కళాశాల వద్ద అధికారులు ఎవరైనా వచ్చారా..? అని మంత్రి ఆరా తీశారు. అక్కడ ఉన్న వారు ఎవరూ కూడా రాలేదని సమాధానం చెప్పారు. దీంతో మంత్రి పర్యటిస్తే అధికారులు ఎందుకు హాజరుకాలేదని, అధికారుల పనితీరు బాగోలేదని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుసుకున్న ఎంపీడీవో జయశీల ఆఘమేఘాల మీద ఆయన పర్యటన ముగింపులో వచ్చారు. అయినా అధికారుల తీరు పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement