అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-19T05:53:44+05:30 IST

పట్టణ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్‌ జి.రవి అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణం లో జరుగుతున్న వైకుంటధామ పనులను, పట్టణ ప్రణాళిక పనులను ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి

 మెట్‌పల్లిలో కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన

మెట్‌పల్లి, జూన్‌ 18 : పట్టణ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్‌ జి.రవి అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణం లో జరుగుతున్న వైకుంటధామ పనులను, పట్టణ ప్రణాళిక పనులను ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక పను లను, వెంకట్రావ్‌పేటలో జరుగుతున్న శాటిటేషన్‌ పనులను, రేగుంటలో నర్సరీల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వర్షకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శానిటేషన్‌ పనులు ముమ్మరం చేయాలని అన్నారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్‌కు సూచించారు. ఈ కా ర్యక్రమంలో ఆర్డీవో వినోద్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, డీ ఈ యాదగిరి, ఎఇ అరుణ్‌ కుమార్‌, నరేష్‌ ఉన్నారు.


Updated Date - 2021-06-19T05:53:44+05:30 IST