అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T04:09:31+05:30 IST

నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రూ.7కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులు, మందమర్రిలోని ఐటీఐ కళాశాల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

 చెన్నూరు, జనవరి 21: నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.    రూ.7కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులు, మందమర్రిలోని ఐటీఐ కళాశాల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్య తతో చేపట్టాలని సూచించారు. పనుల విషయంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. 

 భీమారం మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణ కులస్థులు, అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు టీఆర్‌ఎస్‌ బలోపేతం కృషి చేయాలన్నారు. 

స్పౌజ్‌లను జిల్లా కేడర్‌కే కేటాయించాలి 

ప్రభుత్వ ఉద్యోగ భార్యభర్తలను జిల్లా లోకల్‌ కేడర్‌కే కేటాయించాలని  శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో స్పౌజ్‌ బాధితులు ప్రభుత్వ విప్‌ బాల్క సుమ న్‌కు వినతిపత్రం అందించారు. సీఎం కేసీఆర్‌ భార్యాభ ర్తలు కోరుకున్న చోటుకు ఒకే జిల్లాకు బదిలీ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ కేవలం 19 జిల్లాలకు మాత్రమే సానుకూలంగా కేటాయించార న్నారు. మిగిలిన 13 జిల్లాలకు స్పౌజ్‌ బదిలీలను అనుమతించడం లేదన్నారు. భార్య భర్తలు వారు కోరుకున్న ఒకే జిల్లాకు అనుమతించేలా చూడాలని విన్నవించారు. స్పౌజ్‌ బాధితులు శ్రీనివాస్‌, మంజుల, జరీనాబేగం, లక్ష్మణ్‌రావు, సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T04:09:31+05:30 IST