గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-01-29T04:25:56+05:30 IST

ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరాగా పూర్తి చేయాలని ఎంపీ సోయంబాపూరావు అన్నారు.

గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీ సోయం బాపూరావు

ఆసిఫాబాద్‌, జనవరి 28: ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరాగా పూర్తి చేయాలని ఎంపీ సోయంబాపూరావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా పరిధిలోని ఆదిలా బాద్‌, కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను సంబంధిత అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రామాలన్నీ శుభ్రంగా ఉండేం దుకు చర్యలు చేపట్టడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణపనులు పూర్తి చేయాలన్నారు. అంతర్గత రహ దారులు నిర్మించాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా అయ్యే విధంగా పైపులైన్‌ పనులు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నా యని, ప్రభుత్వం నుంచి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతోపాటు సహాయ, సహకారాలు అందించాలని తెలిపారు.

మండలానికి ఒక గ్రామంలో దళితబంధు

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు అమలుకు మొదటి విడతలో భాగంగా ఆసిఫా బాద్‌ నియోజకవర్గంలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎస్పీ(అడ్మిన్‌) వైవీఎస్‌ సుదీంద్ర, ఎమ్మెల్యే ఆత్రంసక్కుతో కలిసి జిల్లాఅధికారులు, నాయ కులతో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీవిజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దళితబంధు పథకం కోసం మొదటి విడతలో మండలానికి ఒకగ్రామం ఎంపిక చేస్తామని, త్వరలోనే ఆయావివరాలు ప్రకటిస్తామని అన్నారు. లబ్ధిదారులందరికీ ఒకేవిధమైన యూనిట్‌ కాకుండా వేర్వేరుగా యూనిట్లు ఎంపిక చేస్తా మని అన్నారు. ఆదిశగా అవగాహన కల్పిస్తామ న్నారు. దళితబంధుతో పాటు రైతు బంధు, రైతుబీమా పథకాలలో నిధుల మంజూరుకు కొంత మంది దళారులు డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటివి జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. దళితబంధును అర్హులైన దళిత కుటుం బాలకు కేటాయించేందుకు జిల్లాలో నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీలు శ్రీనివాస్‌, కరుణాకర్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి సజీవన్‌, ఆర్డీవో దత్తు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ అనధికారికసభ్యులు కేశవ్‌రావు, గోపాల్‌నాయక్‌, అశోక్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T04:25:56+05:30 IST