పట్టణ సుందరీకరణకు అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2020-12-04T05:23:36+05:30 IST

పట్టణ సందరీకరణకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లో రూ.50లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు రూ.3.80 కోట్లతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని ఆరు జంక్షన్‌ పనులకు ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌లతో కలిసి భూమిపూజ చేశారు.

పట్టణ సుందరీకరణకు అభివృద్ధి పనులు
భూమిపూజ చేస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 3: పట్టణ సందరీకరణకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లో రూ.50లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు రూ.3.80 కోట్లతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని ఆరు జంక్షన్‌ పనులకు ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌లతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పట్టణాన్ని సుందరీకరణ చేయడానికి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అందులో భాగంగా వార్డు నెంబర్‌ 15 భగత్‌సింగ్‌ కాలనీలో రూ.50లక్షలతో బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేసుకున్నామని తెలిపారు. వార్డులోని ప్రజల సమస్యలను చైర్మన్‌కు తెలియజేయాలని సూచించారు. కాలనీల్లో తాగునీరు, వీధి లైట్ల సమస్య పరిష్కరిస్తామన్నారు.

రూ.20 లక్షలతో మదర్శ పాఠశాల..

జిల్లా కేంద్రంలో రూ.20లక్షలతో మదర్శ పాఠశాలను నెలకొల్పుతామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి వసతులకు నిధులు వెచ్చించి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో పట్టణంలోని ప్రతి ఒక్కరికి రోజుకు 130లీటర్ల తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. పట్టణంలోని నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని, డబుల్‌ బెడ్‌రూం నిర్మించి ఇస్తామని, ఇప్పటికే సుమారు 5000 మందిని గుర్తించి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డిభోజారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మున్సిపల్‌ అధికారులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:23:36+05:30 IST