Abn logo
Jun 13 2021 @ 23:56PM

డీఎంఎఫ్‌టీ నిధులతో అభివృద్ధి పనులు

తాండూరులోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

  • రూ.14కోట్లా 56లక్షలతో 331 పనులకు శ్రీకారం 
  • ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకోవాలి
  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి


తాండూరు: తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.14కోట్లా 56లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో 331 అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణాగౌడ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గానికి మొట్ట మొదటిసారి పెద్ద మొత్తంలో డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరయ్యాయన్నారు. రూ.కోటీ 52లక్షలతో తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, శిథిలావస్థకు గురైన పాఠశాలల భవనాల మరమ్మతులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.2కోట్లతో పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా రేలింగ్‌తోపాటు ఫుట్‌పాట్‌, రూ.కోటితో విలియంమూన్‌ చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌నగర్‌ వరకు రోడ్డు నిర్మాణం పనులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌లను ఆయా మండలాల ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈసమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అప్పు, శకుంతల తదితరులు పాల్గొన్నారు.

యువకులు స్వయం ఉపాధితో రాణించాలి

యువకులు స్వయం ఉపాధితోపాటు వివిధ వ్యాపారాల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణంలోని గంజ్‌ ప్రాంతంలో ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ  రైతులకు కావాల్సిన సేవలను రైతు సేవాకేంద్రం ద్వారా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైౖర్మన్‌ మురళీకృష్ణాగౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, నాయకులు నర్సింహులు, శ్రీనివాసాచారి, అప్పు, ఉమాశంకర్‌, సాయిరెడ్డి, ఇర్ఫాన్‌, సంతోష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రొసీడింగ్‌లు అందజేత 

తాండూరు నియోజకవర్గ పరిధిలో మండలాలకు మంజూరైన రూ.14కోట్ల 56లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టబోయే పనులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదివారం తాండూరులో ఆయా మండలాల ప్రజా ప్రతినిఽధులకు ప్రొసీడింగ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలాల నాయకులు పాల్గొన్నారు.