శివారు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సబితారెడ్డి

ABN , First Publish Date - 2021-07-24T06:38:51+05:30 IST

నగర శివారులోని పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు.

శివారు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సబితారెడ్డి
గుర్రంగూడ ఆదిత్యనగర్‌లో మాట్లాడుతున్న సబితారెడ్డి

సరూర్‌నగర్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నగర శివారులోని పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని కుర్మల్‌గూడ 10వ డివిజన్‌లో రూ.20లక్షలతో, గుర్రంగూడ 7వ డివిజన్‌లోని ఆదిత్యనగర్‌లో మరో రూ.20లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శుక్రవారం మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, కార్పొరేటర్లు బి.రోహిణీరమేశ్‌ముదిరాజ్‌, జి.లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతిలో కార్యక్రమంలో కార్పొరేషన్లలోని చాలా సమస్యలు పరిష్యారమయ్యాయని అన్నారు. మేజర్‌ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. వరద ముంపు సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్రంక్‌లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను సైతం పటిష్ఠం చేస్తున్నామని ఆమె అన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ-2లో భాగంగా పనులు చేపట్టడానికి రూ.1200 కోట్లు మంజూరు కాగా, అందులో బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, జల్‌పల్లి, తుక్కుగూడలకు కలిపి రూ.211 కోట్లు కేటాయించామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ టి.కృష్ణమోహన్‌రెడ్డి, కార్పొరేటర్‌ దడిగ శంకర్‌, మాజీ కౌన్సిలర్‌ గుర్రం సాయికిరణ్‌రెడ్డి, జక్కిడి విష్ణువర్ధన్‌రెడ్డి, భాగ్యనగర్‌ సొసైటీ చైర్మన్‌ మర్రి నర్సింహారెడ్డి, తుర్కయంజాల్‌ రైతు సంఘం డైరెక్టర్‌ సామ సత్యనారాయణరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు మర్రి జగన్‌మోహన్‌రెడ్డి, జి.రఘునందన్‌చారి, ఈ.సమైఖ్యజ్యోతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T06:38:51+05:30 IST