విజయోస్తు!

ABN , First Publish Date - 2020-10-25T07:07:11+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన విజయదశమి వేడుక జిల్లావ్యాప్తంగా ఆదివారం వైభవంగా జరగనుంది. ఎక్కడికక్కడ వేడుకల కోసం ఆలయాలన్నీ ముస్తాబ య్యాయి.

విజయోస్తు!

జిల్లావ్యాప్తంగా వైభవంగా ముస్తాబైన అమ్మవారి ఆలయాలు, పందిళ్లు
కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పండగ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు
అటు కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి మార్కెట్‌కు కొనుగోళ్ల కళ కొంతే
వస్త్ర, ఎలకా్ట్రనిక్స్‌, వాహన షోరూముల్లో భారీ ఆఫర్లున్నా సేల్స్‌ అరకొరే
నేటి పండగరోజు విక్రయాలపైనే వ్యాపారుల ఆశలన్నీ
మరోపక్క కొవిడ్‌ నియంత్రణ ఉల్లంఘించే దుకాణాలపై అధికారుల నిఘా
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన విజయదశమి వేడుక జిల్లావ్యాప్తంగా ఆదివారం వైభవంగా జరగనుంది. ఎక్కడికక్కడ వేడుకల కోసం ఆలయాలన్నీ ముస్తాబ య్యాయి. అలరించే విద్యుత దీపకాంతులతో ధగధగలాడుతున్నాయి. గడిచిన కొన్ని రోజు లుగా కీలక ఆలయాల్లో వరుసగా ఉత్సవాలు జరుగుతుండగా, తుది ఘట్టమైన దసరా రోజు పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించడానికి ఆలయాల్లో ఏర్పాట్లు జరిగాయి. రాజమ హేంద్రవరం దేవీచౌక్‌లో దుర్గాదేవి, జేఎన రోడ్డులో దుర్గమ్మతల్లి, ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్డులో శ్యామలాంబ అమ్మవారి ఆలయాలు, కాకినాడలో బాలత్రిపురసుందరి అమ్మవారి ఆలయం, పిఠాపురం పాదగయ, కాకినాడ రూరల్‌లో శ్రీపీఠం తదితర ప్రాంతాల్లోనిఅమ్మవారి ఆల యాల్లో గడిచిన కొన్ని రోజులుగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా, ఆదివారం అసలైన పండగ కావడంతో భారీఎత్తున వేడుకలు జరపడానికి ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. ఎక్కడికక్కడ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బారికేడ్లు ఇప్పటికే నిర్మించారు. విజయదశమి రోజు వచ్చే భక్తులు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేశారు. అటు కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా పోలీసులు సైతం ఆలయాల వద్ద గస్తీ నిర్వ హిస్తున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించేలా మైకుల్లో ప్రకటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కాకినాడ, రాజమహేంద్రవరం పట్టణాల్లో పలుచోట్ల అమ్మవారి పందిళ్లు ఏర్పా ట్లు చేయగా, అక్కడ కూడా ఉత్సవాలు భారీగానే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేసి వేడుకలు జరుపుతున్నారు. కాగా శరన్నవ రాత్రుళ్లు ఆదివారం దసరా పండగతో ముగియనున్న నేపథ్యంలో అన్ని ఆలయాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి వచ్చిన తర్వాత జనం కాస్త పండుగ వాతావరణంలోకి వచ్చింది ఈ విజయదశమి కావడం, ఇప్పటికైనా ఈ పీడ వదలాలని అమ్మవారిని ప్రార్థించని వారు లేరు. అలాగే అస్తవ్యస్తమైన తమ జీవన నావ కుదుటపడాలని మొక్కని వారూ లేరు. మొత్తానికి ఈ విజయదశమి తమకు విజయాలను అందించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.
కళకళ అంతంతే...
ఏటా దసరా ఉత్సవాలకు ఏటా జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున వ్యాపారం జరుగుతుంది. వస్త్ర, వాణిజ్య, వాహన దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. రాజమహేం ద్రవరంలో తాడితోట హోల్‌సేల్‌ వస్త్రమార్కెట్‌లో రూ.50 కోట్ల వరకు క్రయవిక్రయాలు జరుగుతాయి. జిల్లావ్యాప్తంగా ఎలకా్ట్రనిక్స్‌, వస్త్ర, బంగారు ఆభరణాలు, వాహన షోరూంల్లో విక్రయాలు అన్నీ కలిపి దసరా మార్కెట్‌ రూ.150 కోట్లపైనే ఉండేది. అయితే ఈ దఫా కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో దసరా మార్కెట్‌ పూర్తిగా పడకేసింది. చివరి రెండు రోజుల్లో కొంతలో కొంత పుంజుకున్నా మార్కెట్‌ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఇతర పట్టణాల్లో వస్త్ర దుకాణాలు, ఎలకా్ట్రనిక్స్‌, వాహన షోరూంలూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించాయి. కొవిడ్‌తో గడిచిన ఆరు నెలల్లో వ్యాపారాలు దివాళా తీసిన నేపథ్యంలో దసరా పండగ ద్వారా అయినా కొంతలోకొంత నష్టం పూడ్చుకోవాలని భావించాయి. అయితే ఆఫర్ల మేళాలతో ఎంత ఊరిస్తున్నా కొనుగోళ్ల కళ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. గత సీజనలతో పోల్చితే అమ్మకాలు పెద్దగా ఈ సారి లేవు. పేరుమోసిన ఎలకా్ట్రనిక్స్‌ దుకాణాల్లో దసరా వేడుక పేరుతో జిల్లావ్యాప్తంగా వందల్లో ఫ్రిజ్‌లు, ఏసీలు, టీవీలు అమ్ముడయ్యేవి. కానీ ఈసారి ఒక్కో దుకాణంలో విక్రయాలు పదుల సంఖ్యకే పరిమితమయ్యాయి. ద్విచక్ర, కార్ల షోరూంల్లోను సందడి పెద్దగాలేదు. ఏటా దసరాకు పెద్దఎత్తున పాత వాహనాల ఎక్సేంజీ మేళా జరిగేది. ఈ పేరుతో వేలల్లో వాహనాలు అమ్ముడయ్యేవి. ఈసారి ఒక్కో కంపెనీ వాహన షోరూం లో వందలోపే విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో సగానికి సగంపైనే పండగ విక్రయాలు పడిపోయాయి. అయితే చాలామంది విజయదశమి రోజు కొత్త వస్తువులు కొనుగోళ్లు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో ఆదివారం పండగ రోజు అమ్మకాలపైనే అన్ని వాణిజ్య దుకాణాలు ఆశలుపెట్టుకుని కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నాయి. కాగా వాణిజ్య దుకాణాల్లో కొవిడ్‌ నిబంధ నల ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా తక్షణం పట్టుకుని సీజ్‌ చేసేందుకు అధికారులు బృందాలను ఏర్పాటుచేశారు.

Updated Date - 2020-10-25T07:07:11+05:30 IST