గంటకు 32 కరోనా పరీక్షలు చేసే యంత్రం!

ABN , First Publish Date - 2020-07-08T07:46:52+05:30 IST

కరోనాపై పోరులో భారత కంపెనీలు మరో ముందడుగు వేశాయి. వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో గంటకు 32 కొవిడ్‌ పరీక్షలు చేయగల స్వయంచాలక పరీక్షా యంత్రాన్ని(ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ మెషీన్‌) ఆవిష్కరించాయి...

గంటకు 32 కరోనా పరీక్షలు చేసే యంత్రం!

పుణె, జూలై 7: కరోనాపై పోరులో భారత కంపెనీలు మరో ముందడుగు వేశాయి. వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో గంటకు 32 కొవిడ్‌ పరీక్షలు చేయగల స్వయంచాలక పరీక్షా యంత్రాన్ని(ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ మెషీన్‌) ఆవిష్కరించాయి. దీన్ని పుణెకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అందుబాటులో కరోనా టెస్టు కిట్లతో పోలిస్తే.. ఇది అతి తక్కువ మానవ ప్రమేయంతో పరీక్షలను సాఫీగా పూర్తి చేయగలదు. దీని నిర్వహణకు ఒకే ఒక టెక్నీషియన్‌ ఉంటే చాలు. ప్రస్తుతానికి రెండు రకాల టెస్టింగ్‌ యంత్రాలను తయారు చేశామని, వాటిలో పెద్ద దాని ధర రూ.40 లక్షలని ఎస్‌ఐఐ సీఈవో అధర్‌ పూనావాలా వెల్లడించారు.


కొనాలని భావించే వైద్య సంస్థలు, పరీక్షా కేంద్రాలు ఈనెల 13 నుంచి ముంద స్తు ఆర్డర్ల ద్వారా బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ మరో 6 నెలల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మూడో దశ ప్రయోగ పరీక్షల్లో భాగంగా ప్రస్తుతం ఆ వ్యాక్సిన్‌ను 8000 మంది వలంటీర్లపై పరీక్షిస్తున్నారన్నారు. 


Updated Date - 2020-07-08T07:46:52+05:30 IST