Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాస్తవాలు తెలియాలంటే ప్రజల్లోకి రండి: దేవినేని అవినాష్

విజయవాడ: రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెలియాలంటే మాజీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్.. ప్రజల్లోకి రావాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన నేతలు.. పనీపాట లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల విషయంపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో నాణ్యత లేని రోడ్లు వేశారు కాబట్టే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దుర్గగుడి ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ప్రారంభించటం గొప్ప కాదు అని.. పూర్తి చేయడం గొప్ప అనే విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలని అవినాష్ సూచించారు.

Advertisement
Advertisement