Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని శ్రీమన్నారాయణకు కన్నీటి వీడ్కోలు

కంచికచర్ల, డిసెంబరు 3 : దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కంచికచర్లలోని స్వగృహం వద్ద ఉంచిన ఆయన భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వేలాది మంది అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఇంటి వద్ద నుంచి రెండున్నర కిలోమీటర్లు భారీ ఊరేగింపుతో దేవినేని రమణ ఘాట్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన రెండో కుమారుడు పద్మనాభరావు అంత్యక్రియలు చేశారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, కొల్లు రవీంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బొండా ఉమామహేశ్వ రరావు, ధూళిపాళ్ల నరేంద్ర, ముద్దరబోయిన వెంకటేశ్వర రావు, రావి వెంకటేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీలు అమ్మినేని శివరామకృష్ణ, బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, షేక్‌ నాగుల్‌మీరా, కాగిత వెంకట కృష్ణప్రసాద్‌, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, గొట్టిపాటి రామకృష్ణ, నాగుల్‌మీరా, జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌, జనసేన  నాయకుడు పోతిన మహేష్‌, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావుతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు శ్రీమన్నారాయణ భౌతికకాయానికి నివాళులర్పించారు.
దేవినేని శ్రీమన్నారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ తదితరులు


Advertisement
Advertisement